పుట:Oka-Yogi-Atmakatha.pdf/509

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అలౌకిక ఘటనల నియమం

473

శాస్త్రానికికాని సంబంధించిన ఏ నియమమూ, స్వతసిద్ధమైన వ్యతిరేక సూత్రాలు లేదా విరుద్ధ సూత్రాలు లేకుండా లేదు.

అటువంటప్పుడు భౌతికశాస్త్రం, సృష్టికి స్వరూపమైన మాయకు అతీతంగా నియమాలు రూపొందించలేదు. ప్రకృతే మాయ; కాబట్టి ప్రకృతిశాస్త్రం, దాని అనివార్య సహజగుణంతో వ్యవహరించక తప్పదు. దాని పరిధిలో అది, శాశ్వతమూ అక్షయమూ; భవిష్యత్ విజ్ఞానశాస్త్రవేత్తలు, అసంఖ్యాకమైన దాని వివిధాకృతుల్లో ఏదో ఒకదాన్ని అన్వేషించడానికి మించి మరేమీ చెయ్యలేరు. ఆ విధంగా విజ్ఞానశాస్త్రం, చరమ తత్త్వాన్ని చేరుకోలేక ఎప్పటికీ ప్రవాహస్థితిలోనే ఉండిపోతుంది; నిజానికది, అప్పటికే సిద్ధంగా ఉండి పనిచేస్తున్న విశ్వానికి సంబంధించిన నియమాల్ని ఆవిష్కరించడానికి తగినదే కాని, నియమ నిర్ణేతా ఏకైక సూత్రధారీ అయిన పరమాత్మను కనుక్కోడానికి అశక్తమయినది. గురుత్వాకర్షణ, విద్యుత్తుల ఘనమైన అభివ్యక్తులయితే తెలియవచ్చాయి కాని అసలు గురుత్వాకర్షణ, విద్యుత్తు అన్నవి ఏమిటో ఏ మర్త్యుడూ ఎరగడు.[1]

అనేక వేలమంది ప్రవక్తలు, మానవజాతికి అప్పగించిన పని, మాయను అధిగమించాలన్నదే. సృష్టిలోని ద్వంద్వానికి అతీతుడై సృష్టికర్త ఏకత్వాన్ని దర్శించడమే మానవుడి సర్వోన్నత లక్ష్యంగా భావిం

  1. గొప్ప ఆవిష్కర్త అయిన మార్కొనీ, చరమతత్త్వాలముందు శాస్త్ర అసమగ్రతను అంగీకరిస్తూ ఇలా చెప్పాడు; “జీవితాన్ని పరిష్కరించడం విషయంలో విజ్ఞానశాస్త్రానికి గల అసమర్థత అద్వితీయమైనది. విశ్వాసమే కనక లేకపోయినట్లయితే ఈ యథార్థం నిజంగా భయంకరంగా ఉండేది. మనిషి ఆలోచనకు ఎదురయే సమస్యల్లో అన్నిటికన్న ఎక్కువగా ఎప్పుడూ వేధించే సమస్య జీవిత రహస్యమేనన్నది నిశ్చయం.”