పుట:Oka-Yogi-Atmakatha.pdf/508

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

472

ఒక యోగి ఆత్మకథ

ఒక మాయా మౌలిక నియమం మీద నడుస్తోందని వైదిక ధర్మగ్రంథాలు ఘోషిస్తున్నాయి. ఏకైక జీవుడయిన భగవంతుడు కేవల అద్వితీయుడు. సృష్టిలో వేరుగానూ నానా రూపాలలోనూ ప్రత్యక్షం కావడానికి ఆయన మిథ్యావరణాన్ని లేదా అవాస్తవమైన ముసుగును ధరిస్తాడు. భ్రాంతి జనకమైన ఈ ద్వంద్వ ఆవరణమే మాయ.[1] ఆధునిక కాలంలోని గొప్ప వైజ్ఞానిక ఆవిష్కరణలు అనేకం. సనాతన ఋషుల ఈ సులభ ప్రకటనను ధ్రువపరిచాయి.

న్యూటన్ గమన నియమం, “మాయ తాలూకు నియమమే.” ప్రతి ఒక్క చర్యకూ సమానమూ విరుద్ధమూ అయిన ప్రతిచర్య ఎప్పుడూ ఉంటుంది; ఏ రెండు వస్తువుల పరస్పర చర్యలయినా ఎప్పుడూ సమానంగా, ఒకదానికొకటి వ్యతిరేక దిశలో సాగుతూంటాయి.” ఈ ప్రకారంగా చర్యా, ప్రతిచర్యా సరిగ్గా సమానంగా ఉంటాయి. “ఒకేఒక బలం ఉండడం అసంభవం; సమానంగానూ వ్యతిరేకంగానూ రెండు బలాలు ఉండాలి; అలా ఎప్పుడూ ఉంటున్నాయి కూడా.”

ఆధారభూతమైన ప్రాకృతిక కార్యకలాపాలు, అవి మాయలోంచి పుట్టినవేనన్న సంగతిని బయలుపరుస్తున్నాయి. ఉదాహరణకు, విద్యుత్తు, ఆకర్షణ వికర్షణల దృగ్విషయం, దాని ఎలక్ట్రాన్‌లూ ప్రోటాన్లూ (ఋణ విద్యుదణువులూ ధనవిద్యుదణువులూ) పరస్పర విరుద్ధమైన విద్యుత్ శక్తులు. మరో ఉదాహరణ: భౌతిక పదార్థంలో పరమ సూక్ష్మకణమైన అణువు (ఆటం) భూమి మాదిరిదే; ధన, ఋణ ధ్రువాలుగల అయస్కాంతం. ఈ భౌతిక ప్రపంచం యావత్తూ ధ్రువత్వ నిరంకుశాధికారానికి లోబడి ఉన్నది; భౌతికశాస్త్రానికి కాని, రసాయనశాస్త్రానికికాని, మరే

  1. 10 పుటలో అధోజ్ఞాపిక చూడండి.