పుట:Oka-Yogi-Atmakatha.pdf/480

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

444

ఒక యోగి ఆత్మకథ

వాళ్ళు ఎనమండుగురే పిల్లలు; అయినా పరిస్థితి నే నర్థం చేసుకో గలను!” – అన్నారాయన, మిలమిల మెరిసే కళ్ళతో.

మాకున్న డెబ్భై బిగాల మంచి సారవంతమైన భూమిలో విద్యార్థులూ ఉపాధ్యాయులూ నేనూ రోజూ కొంతసేపు చొప్పున తోటపని, ఆరుబయట ఇతర పనులు చేస్తూ ఆనందించేవాళ్ళం. మాకు పెంపుడు జంతువులు చాలా ఉండేవి; ఒక లేడి పిల్లతో సహా. మా పిల్లలు దాన్ని ముద్దుచేశారు. నేను కూడా అదంటే ఎంత మనసుపడేవాణ్ణంటే, అది నా గదిలోనే పడుక్కోడానికి అనుమతించాను. తూరుపురేక లారే వేళ ఆ చిట్టిపాప, పొద్దుటి లాలింపుకోసం నా పక్కదగ్గిరికి గునగునా నడుస్తూ వచ్చేది.

ఒకనాడు, ఏదో పనిమీద రాంచీ ఊళ్ళోకి వెళ్ళవలసి వచ్చి, మామూలు వేళకంటె ముందే లేడిపిల్లకి పాలు పట్టాను. నేను మళ్ళీ తిరిగి వచ్చేదాకా దానికి ఏమీ పట్టవద్దని కుర్రవాళ్ళకి చెప్పాను. కాని ఒక కుర్రవాడు, నా మాట పట్టించుకోకుండా, దానికి బోలెడు పాలు పట్టేశాడు. సాయంత్రం నేను తిరిగి వచ్చేసరికి దుర్వార్త వినవచ్చింది: “పాలు ఎక్కువ పట్టడంవల్ల లేడిపిల్ల ప్రాణం పోయే స్థితిలో ఉందని.”

కళ్ళలో నీళ్ళు తిరుగుతూ ఉండగా, మృతప్రాయమై ఉన్న ఆ లేడిపిల్లని ఒళ్ళో పెట్టుకుని, దాని ప్రాణం కాపాడమని దీనంగా దేవుణ్ణి ప్రార్థించాను. కొన్ని గంటల తరవాత ఆ చిట్టిలేడి కళ్ళు విప్పింది; లేచి నించుని నీరసంగా అడుగులు వేసింది. విద్యాలయమంతా ఆనందంతో పరవళ్ళు తొక్కింది.

కాని ఆనాటి రాత్రి గంభీరమైన గుణపాఠం ఒకటి తెలియ వచ్చింది; నేనెన్నడూ మరిచిపోలేనిదది. రాత్రి రెండు గంటలవరకు,