పుట:Oka-Yogi-Atmakatha.pdf/481

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాంచీలో యోగవిద్యాలయ స్థాపన

445

లేడిపిల్ల దగ్గరే మెలకువగా కూర్చున్నాను; ఆ తరవాత నిద్ర పట్టేసింది. లేడిపిల్ల కలలో కనిపించి నాతో మాట్లాడింది:

“నన్ను పట్టి ఉంచేస్తున్నారు, నన్ను పోనివ్వండి; నన్ను పోనివ్వండి!”

“సరే” అన్నాను కలలో.

వెంటనే మేలుకున్నాను; “ఏమర్రోయ్ పిల్లలూ! లేడి చచ్చి పోతోంది!” అని అరిచాను. పిల్లలు నా దగ్గరికి ఉరుక్కొచ్చారు.

గదిలో, నేను లేడిపిల్లను పడుకోబెట్టిన చోటికి పరిగెత్తాను. అది లేవడానికి చిట్టచివరి ప్రయత్నం ఒకటి చేసి, నా వేపు తూలి, ప్రాణం విడిచి నా కాళ్ళదగ్గర కూలింది.

జంతువుల భవితవ్యాల్ని నడిపించి క్రమబద్ధం చేసే ‘సమస్త కర్మ’ ప్రకారం, ఆ లేడి జీవితం అంతటితో ముగిసిపోయింది; ఉత్తమ జన్మకు పురోగమించడానికి అది సిద్ధంగా ఉంది. నా గాఢమైన అనుబంధంవల్లా అది స్వార్థంతో కూడిందని తరవాత గ్రహించాను – ఎంతో శ్రద్ధగా చేసిన ప్రార్థనలవల్లా దాన్ని జంతురూప పరిమితుల్లో ఆపి ఉంచగలిగాను; కాని దాని ఆత్మ, విడుదలకోసం పెనుగులాడుతోంది. ఆ లేడి ఆత్మ, ప్రేమతో కూడిన నా అనుమతి లేకుండా పోనూపోదు, పోనూలేదు కనక, కలలో నన్ను బతిమాలుకుంది. నేను ఒప్పుకోగానే వెళ్ళిపోయింది.

నాకు విచారమంతా తొలగిపోయింది. తన బిడ్డలు, సృష్టితో ప్రతిదాన్నీ తనలోని ఒక భాగంగానే ఎంచి ప్రేమించాలనీ, చావు అన్నిటినీ అంతంచేస్తుందనే మాయలో పడి బాధపడగూడదనీ భగవంతుడు కోరతాడని నేను కొత్తగా గ్రహించాను. అజ్ఞాని అయిన మనుష్యుడు, తన ప్రియమిత్రుల్ని శాశ్వతంగా మరుగుపరుస్తున్నట్టుగా బాహ్యదృష్టికి