పుట:Oka-Yogi-Atmakatha.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

క్రియాయోగశాస్త్రం

423

“శరీర వ్యాయామం, మనోనిగ్రహం, ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగ మవుతుంది.”[1] ధ్యానంలో వినవచ్చే ఓంకారమనే యథార్థమైన విశ్వనాదమే దేవుడని అంటాడు పతంజలి.[2] ఓంకారం సృజనశీలక శబ్దబ్రహ్మం; స్పందనాత్మక బ్రహ్మాండ చాలకయంత్ర ధ్వని; ఈశ్వర సత్తకు ప్రత్యక్ష సాక్షి.[3] యోగసాధన కొత్తగా మొదలుపెట్టిన వాడు సైతం, అద్భుతమైన ఓంకార నాదాన్ని త్వరలోనే తన లోపల వినవచ్చు. ఆనందమయమైన ఈ ఆధ్యాత్మిక ప్రోత్సాహంతో అతడు, తాను ఊర్ధ్వలోకాలతో సంపర్కం పెట్టుకున్నానని నమ్మగలుగుతాడు.

క్రియాయోగ ప్రక్రియ, అంటే ప్రాణశక్తి నియంత్రణగురించి

  1. [తపఃస్వాధ్యా యేశ్వరప్రణిధానాని క్రియాయోగః] యోగ సూత్రాలు 2 : 1. క్రియాయోగమన్న మాట వాడడంలో పతంజలి, ఉత్తరోత్తరా బాబాజీ ఉపదేశించిన ప్రక్రియనికాని, దాదాపు అలాటి మరో ప్రక్రియనికాని ఉద్దేశించి ఉండవచ్చు. మొత్తానికి పతంజలి, ప్రాణశక్తిని అదుపులో పెట్టే కచ్చితమైన ఒకానొక ప్రక్రియను చెబుతున్నాడన్న విషయం యోగసూత్రాల్లో ఆయన చెప్పిన 2 : 49 సూత్రం (దీన్ని ఇక్కడే మరోచోట ఉదాహరించడం జరిగింది) వల్ల రుజువవుతోంది
  2. [తస్య వాచకః ప్రణవః] అందులోనే 1 : 27
  3. “దేవుడు చేసిన సృష్టి ఆదికి విశ్వసనీయమైన, సత్యమైన సాక్షి ‘ఆమెన్,’ ఈ సంగతులు చెబుతోంది.”- రివలేషన్ 3: 14. “ఆదిలో ఉంది శబ్దం; ఆ శబ్దం దేవుడి వద్ద ఉంది, ఆ శబ్దమే దేవుడు... అన్నీ ఆయన (శబ్దం లేదా ఓం) చేసినవే; ఆయన లేనిదే సృష్టిఅయినదేదీ సృష్టిఅయి ఉండేది కాదు.” - యోహాను 1 : 1-3. వేదాల్లో చెప్పిన ‘ఓం’కారం, టిబెటన్ల ‘హుం’ గానూ, ముస్లిముల ‘ఆమీన్ ’గానూ, ఈజిప్టువారూ గ్రీకులు రోమన్లూ, యూదులూ, క్రైస్తవులూ అనే ‘ఆమెన్’ గానూ అయింది. హిబ్రూ భాషలో దీనికి ‘నిశ్చయమైన, విశ్వాసం’గల అని అర్థం.