పుట:Oka-Yogi-Atmakatha.pdf/458

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

422

ఒక యోగి ఆత్మకథ

స్వతుడు మహాధర్మ శాసకుడైన మనువుకు ఉపదేశించాడనీ కూడా కృష్ణుడు చెబుతాడు.[1] ఆ మనువు[2] సూర్యవంశ స్థాపకుడైన ఇక్ష్వాకుడికి ఉపదేశం చేశాడు. ఈ విధంగా ఋషులు రాజయోగాన్ని ఒకరిదగ్గరినుంచి మరొకరికి అందిస్తూ, భౌతిక వాదయుగాలు[3] వచ్చేవరకూ కాపాడారు. ఆ తరవాత, పురోహితుల గోపనప్రవృత్తివల్లా మానవుడి ఉపేక్షవల్లా ఈ పవిత్ర విద్య క్రమంగా అందుబాటులో లేకుండా పోయింది.

యోగవిద్యకు ప్రప్రథమ శాస్త్రకారుడైన ప్రాచీన ఋషి పతంజలి, క్రియాయోగాన్ని రెండుసార్లు పేర్కొంటూ ఇలా రాశాడు:

  1. ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయం
    వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే౽బ్రవీత్.

    ఏవం పరంపరా ప్రాప్త మిమం రాజర్షయో విదుః
    స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప.
                                                      అందులోనే 4 : 1 - 2

  2. మానవధర్మశాస్త్రాలు లేదా మనుస్మృతి రచించిన ప్రాక్ చారిత్రక కాలపు గ్రంథకర్త. శాసనబద్ధం చేసిన ఈ సామాన్యధర్మవ్యవస్థలు భారతదేశంలో ఈనాటికీ అమలులో ఉన్నాయి.
  3. హిందూ పవిత్ర గ్రంథాల లెక్కల ప్రకారం భౌతికవాద యుగాల ఆరంభం, క్రీ. పూ. 3102లో జరిగింది. 12,000 సంవత్సరాల, అయన చక్రంలోని అవరోహణ క్రమంలో వచ్చే చివరి ద్వాపరయుగమూ, సుదీర్ఘమైన విశ్వ చక్రంలోని కలియుగమూ ఆ ఏటనే ఆరంభమయాయి.

    10,000 ఏళ్ళ కిందట మానవజాతి అసభ్యమైన శిలాయుగంలో జీవించేదని నమ్మే మానవ శాస్త్రవేత్తలు చాలామంది, లుమేరియా, అట్లాంటిన్, భారతదేశం, చైనా, జపాను, ఈజిప్టు, మెక్సికో దేశాల్లోనూ అనేక ఇతర దేశాల్లోనూ విస్తృతంగా వ్యాప్తమైన అత్యంత ప్రాచీన నాగరికతల్ని “కట్టుకథల” కింద కొట్టిపారేస్తారు.