పుట:Oka-Yogi-Atmakatha.pdf/425

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వవిద్యాలయపట్టప్రాప్తి

389

నేను రమేశ్‌కు ధన్యవాదాలు చెప్పి సైకిలెక్కేసి గబగబా పరీక్ష హాలుకు వెళ్లాను. అక్కడ బెంగాలీ పరీక్షాపత్రంలో రెండుభాగా లుండడం గమనించాను. మొదటి ప్రశ్న ఏమిటంటే: “విద్యాసాగరుల దానధర్మాలకు రెండు ఉదాహరణలు రాయండి.”[1] అని. అంతకుముందే గడించిన జ్ఞానాన్ని నేను సమాధాన పత్రం మీదికి బదలాయింపు చేస్తూ, రమేశ్ చివరి క్షణం పిలుపును ఖాతరు చేసినందుకు దేవుడికి చిన్నగా ధన్యవాదాలు చెప్పుకున్నాను. విద్యాసాగరుల ఉపకారాలు (ఇప్పుడు నాకు చేసింది కూడా కలుపుకొని) కనక నాకు తెలిసి ఉండకపోతే నేను బెంగాలీ పరీక్షలో పాసయి ఉండేవాణ్ణి కాదు.

పత్రంలో రెండో ప్రశ్న ఇది: “నిన్ను ఎక్కువగా ఉత్తేజపరిచిన ఒక వ్యక్తి జీవితాన్ని గురించి బెంగాలీలో ఒక వ్యాసం రాయండి.” పాఠక మహాశయా, నా కథావస్తువుకు నేను ఎన్నుకున్న వ్యక్తి ఎవరో మీకు వేరే చెప్పక్కర్లేదు. పేజి వెంబడి పేజిగా నేను మా గురుదేవుల స్తుతితో నింపేస్తూ ఉంటే, మీ ఉపదేశాలతోనే కాయితాలు నింపేస్తానని గొణుక్కుంటూ చెప్పిన జోస్యం నిజమవుతున్నదని గ్రహించి చిన్నగా నవ్వుకున్నాను.”

తత్త్వశాస్త్రంలో నా కోర్సు గురించి రమేశ్ ను అడగబుద్ధి కాలేదు. శ్రీయుక్తేశ్వర్‌గారి సన్నిధిలో చాలాకాలం పొందిన శిక్షణ మీద విశ్వాస ముంచి పాఠ్యపుస్తక వివరణల్ని ఉపేక్ష చేసేశాను. నా పేపర్లలో

  1. ఆ ప్రశ్నలో వాక్యనిర్మాణం ఎలా ఉందో నాకు కచ్చితంగా గుర్తు లేదు; కాని నాకు విద్యాసాగరుల గురించి రమేశ్ చెప్పిన రెండు కథలకూ సంబంధించిందేనని గుర్తు ఉంది. పండిత ఈశ్వరచంద్రగారికి ఉన్న విద్వత్తువల్ల, ‘విద్యాసాగర్’ (విద్యలో సముద్రంవంటివారు) అన్న బిరుదుతోనే ఆయన బెంగాలులో విఖ్యాతులయారు.