పుట:Oka-Yogi-Atmakatha.pdf/400

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

364

ఒక యోగి ఆత్మకథ

వస్తావా నువ్వు!” అంటూ ప్రార్థించేవాడు. అనంతమైన సంకల్పశక్తి పాటవంతో ఆ సాధువు క్రమక్రమంగా, రోజుకు పద్దెనిమిది గంటలపాటు పద్మాసనంలో కూర్చుని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు. “మూడేళ్ళు గడిచేసరికి, ఆ అనంతజ్యోతి నాలో మహోజ్జ్వలంగా ప్రకాశించడం గమనించాను. ఆ తేజస్సుకు ఆనందిస్తూ మైమరిచిపోయాను. దైవకృపవల్లనే నా శరీరం సంపూర్ణారోగ్యం పొందిందని, ఆ తరవాత గమనించాను,” అని నాకు చెప్పారాయన.

భారతదేశంలో మొగలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తి (1483-1530) కి సంబంధించి చరిత్ర ప్రసిద్ధమైన రోగనివారణ సంఘటన ఒకటి ఉంది. ఆయన కొడుకు హుమాయూన్ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఆ జబ్బు తనకు వచ్చి, తన కొడుకు బతికి బయటపడాలన్న దృఢ నిశ్చయంతో సంతప్తహృదయుడై ప్రార్థించా డా తండ్రి. హుమాయూన్[1] కోలుకున్నాడు; బాబరు వెంటనే జబ్బు పడ్డాడు; తన కొడుక్కి వచ్చిన జబ్బుతోనే ఆయన చనిపోయాడు.

  1. హుమాయూన్ అక్బరు చక్రవర్తికి తండ్రి. మొదట్లో అక్బరు చక్రవర్తి ఇస్లాం మతోన్మాదంతో హిందువుల్ని హింసించాడు. ఆ తరవాత ఆయన, ‘నాలో జ్ఞానం పెరిగేకొద్దీ, నేను అవమానంతో కుంగిపోయాను,’ అన్నాడు. “దివ్యలీలలు ప్రతి మతంవాళ్ళ మందిరాల్లోనూ సంభవిస్తాయి.” భగవద్గీతను పారశీక భాషలోకి అనువదించే ఏర్పాటు చేశాడతను. అంతే కాకుండా, రోమ్ నుంచి అనేకమంది జెసూయిట్ ఫాదరీలను తన ఆస్థానానికి ఆహ్వానించాడు. అక్బరు, ఈ కింద పేర్కొన్న సూక్తి క్రీస్తు చెప్పినట్టుగా పొరపాటు పడ్డాకూడా, అభిమాన పురస్సరంగా ఉదాహరించాడు. (అక్బరు కొత్తగా నిర్మించిన ఫతేపూర్ సిక్రీ నగరంలో విజయతోరణం మీద చెక్కించినది); “మేరీ కుమారుడు ఏసు (ఆయన ఆత్మకు శాంతి లభించుగాక!) ఇలా అన్నాడు: “ఈ ప్రపంచం ఒక వంతెన; దానిమీంచి సాగిపో; కాని దానిమీద ఇల్లు కట్టకు.”