పుట:Oka-Yogi-Atmakatha.pdf/317

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గోబిపువ్వు దొంగతనం

281

జరిగింది- ‘స’ కి ఆకుపచ్చ వన్నె తోనూ నెమలితోనూ; ‘రి’ కి ఎరుపు తోనూ చాతకపక్షితోనూ; ‘గ’ కి బంగారు వన్నెతోనూ మేకతోనూ; ‘మ’ కి పసుప్పచ్చ కత్తుకలిసిన తెలుపుతోనూ క్రౌంచపక్షితోనూ; ‘ప’ కి నలుపుతోనూ కోకిలతోనూ; ‘ద’ కి పసుప్పుచ్చ వన్నెతోనూ గుర్రంతోనూ; ‘ని’ కి అన్ని వన్నెల కలగలుపుతోనూ ఏనుగుతోనూ సంబంధం నిరూపించారు.

[“షడ్జం మయూరో వదతి, గానస్త్వృషభభాషిణః,
   అజావికంతు గాంధారం, క్రౌంచః క్వణతి మధ్యమం
   పుష్ప సాధారణే కాలే పికఃకూజిత పంచమం,
   ధైవతం హేషతే వాజీ, నిషాదం బృంహతే గజః.”
                                                - ‘అమరకోశః’, నాట్యవర్గః -1 : 184, 185]

భారతీయ సంగీతంలో డెబ్భైరెండు ‘తాట’ల్ని లేదా మేళకర్త రాగాల్ని పేర్కొన్నారు. స్థిరమైన సాంప్రదాయిక రాగాల్ని ఒకదాన్ని ఆశ్రయించుకొని దానిచుట్టూ అనంతంగా అనేకమైన స్వరాలు కల్పించడానికి సంగీత విద్వాంసుడికి సృజనాత్మకమైన అవకాశం ఉంటుంది; అతను ఒకానొక విషయవస్తువు తాలూకు స్థాయీభావం మీద మనస్సును కేంద్రీకరింపజేసి, తన మౌలిక ప్రతిభకుగల పరిమితులవరకూ దానికి అలంకారాలు తీర్చి దిద్దుతాడు. హిందూ సంగీత విద్వాంసుడు, అమిర్చి పెట్టిన స్వరసంగతుల్ని చదవడు. ప్రతి వాద్యకచేరీలోనూ అతను, స్థూలమైన రాగస్వరూపానికి కొత్త దుస్తులు అలంకరిస్తాడు; తరచుగా ఒకేఒక సంగతికి కట్టుబడి ఉంటూ దాని సునిశిత సూక్ష్మ స్వరవైవిధ్యాల్ని తాళ వైవిధ్యాల్నీ అన్నిటినీ పునశ్చరణచేసి వాటికి బలం చేకూరుస్తాడు. పాశ్చాత్య సంగీత రచయితల్లో బాహ్ (Bach) కు, వంద సంకీర్ణ