పుట:Oka-Yogi-Atmakatha.pdf/316

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

280

ఒక యోగి ఆత్మకథ

లన్నిటి మీదా నియంత్రణాధికారం సంపాదించగలుగుతాడు. పదహారోశతాబ్దంలో అక్బరు చక్రవర్తిదగ్గర ఆస్థాన సంగీత విద్వాంసుడుగా ఉన్న మీయాఁ తాన్‌సేన్‌కుగల అద్భుత శక్తుల్ని గురించి చారిత్రక పత్రాలు మనకు తెలియజేస్తాయి. సూర్యుడు నడినెత్తిని ఉన్న సమయంలో, రాత్రిపూట ఆలపించే రాగం ఒకటి వినిపించమని చక్రవర్తి ఆదేశించినప్పుడు తాన్ సేన్ , ఉదాత్త స్వరంలో ఒక మంత్రం జపించాడు; దానివల్ల తక్షణమే రాజప్రాసాద పరిసరాలన్నిటా చీకటి అలుముకు పోయింది.

భారతీయ సంగీతం, స్వరశ్రేణిని (ఆక్టేవ్ ) ఇరవై రెండు శ్రుతులుగా లేదా అర్ధస్వరాంశాలుగా విభజించింది. ఈ సూక్ష్మ స్వర విరామాలు, సంగీతాభివ్యక్తిలో సునిశితమైన ఛాయలు ఏర్పడ్డానికి అవకాశమిస్తాయి. పన్నెండు అర్ధస్వరాలుగల పాశ్చాత్య వర్ణ స్వరగ్రామం (క్రొమాటిక్ స్కేల్) తో వీటిని సాధించడానికి వీలులేదు. స్వరశ్రేణిలోని ఏడు మూల స్వరాల్లో ప్రతి ఒక్కదానికి హిందూ పురాణాల్లో, ఒక రంగుతోనూ, ఒక పక్షికూతతోనూ లేదా జంతువు అరుపులోనూ సంబంధం నిరూపించడం