పుట:Oka-Yogi-Atmakatha.pdf/304

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

268

ఒక యోగి ఆత్మకథ

“కాస్సేపు విశ్రాంతి తీసుకోండి. ముకుందా, మనకి ఎడంవేపున ప్రహరీ వేపు చూడు, దానికి అవతలున్న రోడ్డు గమనించు. ఇప్పుడు ఒకతను అక్కడికి వస్తాడు; నిన్ను దండించడానికి ఉపయోగపడే సాధనం అతను.”

అర్థంకాని ఈ వ్యాఖ్యానాలకి నాకు కలిగిన విసుగును మరుగుపరుచుకున్నాను. కాస్సేపట్లో రోడ్డుమీద ఒక రైతు కనిపించాడు; అర్థంలేని చేష్టలతో చేతులు విసురుగా తిప్పుతూ వికారంగా తైతక్కలాడుతున్నాడు. కుతూహలంతో, దాదాపు చేష్టలుడిగినట్టయిపోయి ఆ వినోదకరమైన దృశ్యానికే కళ్ళప్పగించేశాను. ఆ మనిషి రోడ్డుమీద నడుస్తూ మాకు కనుమరుగయిపోయే చోటికి వచ్చేటప్పటికి, యుక్తేశ్వర్‌గారు అన్నారు, “ఇప్పుడతను వెనక్కి తిరుగుతాడు” అని.

వెంటనే ఆ రైతు తన దిశ మార్చి ఆశ్రమం వెనక వేపుకి దారి తీశాడు. ఇసకదారికి అడ్డబడివచ్చి, దొడ్డి గుమ్మంవేపునుంచి ఆశ్రమంలోకి ప్రవేశించాడు. మా గురుదేవులు అన్నట్టే, నేను దానికి తాళం వెయ్యలేదు. కాస్సేపట్లో అతను నేను ఎంతో అపురూపంగా చూసుకునే గోబిపువ్వుల్లో ఒకటి పట్టుకుని బయటికి వచ్చాడు. చేజిక్కిన దానివల్ల వచ్చిన దర్జాతో పెద్దమనిషి తరహాగా నడుచుకుంటూ పోయాడు.

బయల్పడుతున్న ఈ ప్రహసనంలో నా పాత్ర, తబ్బిబ్బయిన వంచితుడి పాత్రలా కనిపించినప్పటికీ ఆగ్రహంగా అతన్ని వెంబడించ లేనంతగా మాత్రం నన్ను కలవరపరచలేదు. రోడ్డు చేరడానికి నేను సగం దూరం వెళ్ళానో లేదో, గురుదేవులు నన్ను వెనక్కి పిలిచారు. ఆయన విరగబడి నవ్వుతూ ఆపాదమస్తకం ఊగిపోతున్నారు.

“పాపం! ఆ వెర్రివాడు. ఒక్క గోబిపువ్వు కోసం ఊ, ఉవ్విళ్ళూరుతున్నాడు.” అని వివరించారాయన, నవ్వు మధ్యలో. “అంత