పుట:Oka-Yogi-Atmakatha.pdf/299

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

263

ఒక్క చిన్ని నవ్వులబుడగని, నేను
అయిపోయాను ఆనందసాగరంగా.

శ్రీయుక్తేశ్వర్‌గారు నాకు, పరమానందకరమైన ఆ అనుభవాన్ని ఇచ్ఛానుసారంగా ఆవాహనచెయ్యడం ఎలాగో, ఇతరులకు,[1] వాళ్ళ సహజావబోధ మార్గాలు తగిన విధంగా అభివృద్ధి చెందినప్పుడు, ఆ అనుభవం కలిగించడం ఎలాగో నాకు నేర్పారు.

మొదటిసారి అనుభవమయిన తరవాత నేను, ఉపనిషత్తులు దేవుణ్ణి “అత్యంత ఆస్వాదయోగ్యం” అనే అర్థంలో ‘రస’మని (“రసోవై సః” తై తిరీయం) - ఎందుకు చెబుతాయో ప్రతిరోజూ గ్రహిస్తూ కొన్ని నెలల పాటు తాదాత్మ్యస్థితిని పొందుతూ ఉండేవాణ్ణి. అయినప్పటికీ ఒకనాడు పొద్దున గురుదేవుల్ని ఇలా అడిగాను:

“నేను దేవుణ్ణి ఎప్పుడు చూస్తానో తెలుసుకోవాలని ఉందండి.”

“నువ్వు చూశావు.”

“లేదు లేదండి. నేనలా అనుకోడం లేదు!”

మా గురుదేవులు చిన్నగా నవ్వుతున్నారు. “ఈ విశ్వంలో పరిశుభ్రమైన ఒక మూల, ఒక సింహాసనాన్ని అలంకరించిన పూజనీయుడైన ఒక వ్యక్తిని చూడాలనిమట్టుకు నువ్వు ఆశించడంలేదనే నమ్ముతున్నాను! అయితే, ఎవరయినా భగవంతుడి సాక్షాత్కారం పొందినందుకు రుజువుగా అద్భుతశక్తులు కలగాలని నువ్వు ఊహిస్తున్నట్టు కనిపిస్తోంది. అలా కాదు. ఒకడు విశ్వాన్ని అంతనీ అదుపుచెయ్యగల శక్తి సంపాదించి ఉండ

  1. ప్రాచ్య పాశ్చాత్యదేశాల్లో కొంతమంది క్రియాయోగులకు నేను ఈ విశ్వదర్శనానుభవం కలిగించాను. వాళ్ళలో ఒకరు శ్రీ జేమ్స్ జె. లిన్; ఆయన సమాధిలో ఉన్న దృశ్యం ఈ పుస్తకంలోనే ఒక ఫొటోలో ఉంది.