పుట:Oka-Yogi-Atmakatha.pdf/298

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

262

ఒక యోగి ఆత్మకథ

అనంతకాలపు దూరాతిదూర చరమావధిదాకా.
విశ్వసాగరాన్ని నేను,
గమనిస్తున్నాను నాలో తేలుతూపోతున్న చిన్నారి అహాన్ని.
వినిపించాయి అణువుల సచల మర్మరధ్వనులు;
నల్లని నేల, పర్వతాలు, లోయలు, అదుగో, వాటిని కరిగించి పోసిన ద్రవం!
మారుతున్నాయి పారే సముద్రాలు నీహారికాబాష్పాలుగా.
ధ్వనిస్తోంది ఓంకారం ఆ ఆవిరులమీద, అద్భుతంగా తెరుస్తూ వాటి ముసుగుల్ని.
బయల్పడిఉన్నాయి మహాసాగరాలు, మెరిసే ఎలక్ట్రాన్లు ,
విశ్వమృదంగం[1] చివరి ముక్తా యింపుతో,
అదృశ్యమై స్థూలకాంతులు
సర్వవ్యాపకానందపు శాశ్వతకిరణాలుగా మారేదాకా.
వచ్చాను ఆనందంనుంచి, జీవిస్తాను ఆనందంకోసమే, కరిగిపోతాను పవిత్రానందంలోనే.
పానం చేస్తాను మహామనస్సాగరంగా, సృష్టితరంగా లన్నిటినీ,
ఘనం, ద్రవం, ఆవిరి, వెల్తురు, తెరలు నాలుగూ
లేచిపోయాయి పైపైకి.
అన్నిటిలో నేను, ప్రవేశించాను మహిమాన్వితమైన నేనులోకి,
తొలగిపోయాయి శాశ్వతంగా, మర్త్యస్మృతి క్షణిక క్షీణ ఛాయలు,
నిష్కళంకంగా ఉంది నా మానసాకాశం, కిందా ముందూ పైపైనా
నిత్యత్వమూ నేనూ, సమైక్యమైన ఒక్క కిరణం.

  1. సృష్టినంతనూ బహిర్ముఖంచేసే, ‘శబ్దం’ లేదా సృజనాత్మక స్పందమనే ఓంకారం.