పుట:Oka-Yogi-Atmakatha.pdf/292

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

256

ఒక యోగి ఆత్మకథ

మంటున్నది. స్ఫుటంగా చెక్కినట్టున్న గోళాకార పరిరేఖలకు అవతల మిరుమిట్లు గొలుపుతున్న కాంతి, దూరపు అంచులదగ్గర కొద్దిగా మందగించింది. అక్కడ నేను, ఎన్నటికీ తరగని పరిపూర్ణ ప్రభను దర్శించాను. మాటల్లో చెప్పలేనంత సుసూక్ష్మమైనదది; గ్రహరూపాలు అంతకన్న స్థూలమైన కాంతితో ఏర్పడ్డవి.[1]

శాశ్వత ఆకరమయిన పరమాత్మనుంచి ప్రసారితమైన కిరణాల దివ్యనిక్షేపం, నక్షత్ర వీధులుగా ప్రజ్వలిస్తూ వర్ణించనలవిగాని ప్రభలుగా రూపాంతరితమవుతోంది. సృజనశీలక కిరణాలు నక్షత్రమండలాలుగా ఘనీభవించి, ఆ తరవాత పారదర్శక జ్వాలలుగా కరిగిపోవడం మళ్ళీ మళ్ళీ చూశాను. లయబద్ధమైన విపర్యయంవల్ల కోటానుకోట్ల లోకాలు నిర్మల కాంతిలోకి ప్రవేశించాయి. అటు మీదట అగ్ని, ఆకాశంగా మారింది.

తేజోమండల కేంద్రాన్ని నా గుండెలో సహజావబోధ గ్రహణ బిందువుగా గుర్తించారు. నాలోని కేంద్రకం నుంచి వెలువడుతున్న ఉద్దీప్త ప్రథ విశ్వనిర్మితిలో ప్రతి భాగానికి ప్రసరిస్తోంది. అమరత్వాన్ని ప్రసాదించే ఆనందమయ అమృతం, పాదరసంలా ప్రవహిస్తూ నాలో అణు వణువునా స్పందించింది. పరమేశ్వరుడి సృజనాత్మక స్వరం విశ్వ చలన యంత్ర స్పందమయిన ఓంకారం[2]గా ప్రతిధ్వనిస్తూ ఉండడం విన్నాను.

హఠాత్తుగా నా ఊపిరితిత్తుల్లోకి శ్వాస తిరిగి వచ్చింది. నా అనంత అపరిమితత్వాన్ని కోల్పోయానని గ్రహించి, దాదాపు భరించలేనంతగా

  1. సృష్టికి సారభూతమయిన కాంతినిగురించి 30 అధ్యాయంలో వివరించడం జరిగింది.
  2. “ఆదిలో శబ్దం ఉండేది , ఆ శబ్దం ఈశ్వరుడివద్ద ఉండేది; ఆ శబ్దమే ఈశ్వరుడు.” యోహాను 1: 1 (బైబిలు),