పుట:Oka-Yogi-Atmakatha.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

255

అన్నిటినీ చూడగలిగేట్టుగా, విస్తృత వలయాకార దృష్టిగా మారింది. నా తలకు వెనకభాగం ద్వారా, రాయ్‌ఘాట్ సందుకు దిగువున దూరంగా నడుస్తున్న మనుషుల్ని చూశాను , తెల్లటి ఆవు ఒకటి తాపీగా నడిచి వస్తూండడం కూడా గమనించాను. అది, తెరిచిపెట్టిన ఆశ్రమం గేటును చేరినప్పుడు, భౌతికమైన నా రెండు కళ్ళతోనూ చూస్తున్నట్టుగానే దాన్ని పరిశీలించాను. అది ముంగిలి బయటి ఇటిక గోడ వెనక్కి సాగిపోయిన తరవాత కూడా స్పష్టంగానే చూశాను.

అన్ని వైపులా కనిపిస్తున్న నా సర్వదిగ్దర్శక దృష్టికి సోకిన వస్తువులన్నీ కంపిస్తూ చురుకుగా సాగే చలనచిత్రాల మాదిరిగా స్పందించాయి. నా శరీరం, గురుదేవులది, స్తంభాలుగల ముంగిలి, ఉపకరణ సామగ్రి, చెట్లు, ఎండ, అప్పుడప్పుడు తీవ్రంగా అల్లల్లాడి చివరికి కరిగి పోయి ఓ కాంతి సముద్రమయిపోయాయి; గ్లాసుడు నీళ్ళలో వేసిన పంచదార గడ్డలు, గ్లాసు కుదిపినప్పుడు కరిగిపోయినట్లుగా! అన్నిటినీ ఏకంచేసే కాంతి, పర్యాయక్రమంలో స్థూలరూపంలోకి మారుతోంది. ఈ రూపాంతరణ క్రియలు సృష్టిలోని కార్యకారణ సూత్రాన్ని వెల్లడి చేస్తున్నాయి.

నా ఆత్మ తాలూకు ప్రశాంత అనంత తీరాల మీదికి ఒకానొక ఆనందసాగరం వెల్లువలా పొంగి వచ్చింది. పరమాత్మ స్వరూపం అక్షయ ఆనందమన్న అనుభవం పొందాను; ఆయన దేహం అసంఖ్యాకమైన కాంతికణజాలాలు. నాలో పెల్లుబుకుతున్న దివ్యప్రధ పట్నాల్నీ, ప్రపంచ ఖండాల్నీ భూమినీ, సూర్యమండలాన్నీ, నక్షత్ర మండలాన్నీ, సూక్ష్మ నీహారికల్నీ తేలి ఆడే ఆ బ్రహ్మాండాల్నీ చుట్టుముట్టడం మొదలు పెట్టింది. రాత్రివేళ దూరాన కనిపించే నగరంలా, మందకాంతితో వెలుగొందే సమస్త జగత్తూ నా అస్తిత్వపు అనంతత్వంలోనే మిణుకుమిణుకు