పుట:Oka-Yogi-Atmakatha.pdf/293

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విశ్వచేతనానుభవం

257

నిస్పృహ చెందాను. చిచ్ఛక్తికి సులువుగా వసతి కల్పించలేని, అవమానకరమయిన శరీరపంజరానికి నేను మళ్ళీ బందీనయాను.

వ్యర్థజీవితం గడిపే కుర్రవాడిలా నేను బ్రహ్మాండ గృహంనుంచి పారిపోయి సంకుచితమైన ఒక సూక్ష్మ పరిధిలో నన్ను నేను బందీని చేసుకున్నాను.

మా గురుదేవులు నా ఎదురుగా నిశ్చలంగా నించుని ఉన్నారు; చాలాకాలం గాఢమైన ఆకాంక్షతో నేను అన్వేషిస్తూ వచ్చిన విశ్వచేతనానుభవాన్ని (సమాధి స్థితిని) నాకు ప్రసాదించినందుకు ఆయన పాదాల ముందు కృతజ్ఞతతో సాష్టాంగదండ ప్రణామం చెయ్యబోయాను. అప్పు డాయన నన్ను నిటారుగా నిలబెట్టి ప్రశాంతంగా ఇలా అన్నారు;

“నువ్వు పరమానందంతో మరీ అంత మితిమించి మత్తెక్కి పోగూడదు. ప్రపంచంలో నీ కోసం ఇంకా చాలాపని ఉండిపోయింది. రా, బాల్కనీ తుడుద్దాం; ఆ తరవాత అలా గంగ ఒడ్డున తిరిగి వద్దాం.”

నే నొక చీపురుకట్ట తెచ్చాను. గురుదేవులు నాకు సంతులిత జీవన రహస్యం బోధిస్తున్నారని తెలుసుకున్నాను. శరీరం తన దైనందిన విధులు నిర్వర్తిస్తూ ఉండగా ఆత్మ, విశ్వసృష్టిలోని అగాధాల్ని గురించి చింతన చేస్తూ తరిచి చూస్తూ ఉండాలి.

తరవాత శ్రీ యుక్తేశ్వర్‌గారూ నేనూ బయట తిరగడానికి బయలు దేరేటప్పటికి ఇంకా నేను, మాటల్లో చెప్పజాలని ఆనందంలో తన్మయుణ్ణయి ఉన్నాను. మా ఇద్దరి శరీరాల్నీ, కేవలం వెలుతురే మూలభూతంగా గల నదీ తీరంలో రోడ్డుమీద నడుస్తున్న రెండు సూక్ష్మచిత్రాలుగా దర్శించాను.

“జగత్తులో ప్రతి రూపాన్ని ప్రతి శక్తినీ క్రియాశీలకంగా నిలిపేది