పుట:Oka-Yogi-Atmakatha.pdf/288

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 14

విశ్వచేతనానుభవం

“వచ్చేశాను గురూజీ” నా మాటలకన్న సిగ్గుతో చిన్నబోయిన నా ముఖమే ఎక్కువ చెబుతోంది.

“వంటింట్లోకి వెళ్ళి ఏమైనా తినడానికి చూసుకుందాం పద.” మాకు ఎడబాటు కలిగించినవి కేవలం కొన్ని గంటలేకాని రోజులు కావన్నంత మామూలుగా ఉంది శ్రీయుక్తేశ్వర్‌గారి ధోరణి.

“గురుదేవా, నావిధులు విడిచిపెట్టి ఇక్కణ్ణించి అకస్మాత్తుగా వెళ్ళిపోయి మీకు నిరాశకలిగించి ఉంటాను; నా మీద మీకు కోపం వస్తుందేమో అనుకున్నాను.”

“లేదు, లేనేలేదు! కోపమన్నది తీరని కోరికలవల్లే పుడుతుంది. నేను ఎవరిదగ్గర్నించీ ఏమీ ఆశించను; అంచేత వాళ్ళు చేసే పనులు నా ఆశలకు వ్యతిరేకంగా ఉండలేవు. నిన్ను నా అవసరాలకెన్నడూ వాడుకోను; నీ నిజమైన సంతోషమే నాకు సంతోషం.”

“గురుదేవా, దివ్య ప్రేమగురించి అస్పష్టంగానే వింటాం; కాని ఈ నాడు మీ దివ్యస్వరూపంలోనే దానికి వాస్తవమైన నిదర్శన కనిపిస్తోంది నాకు! ఈ లోకంలో, తండ్రి కూడా, తాను అప్పగించిన పనిని కొడుకు చెప్పా చెయ్యకుండా వదిలిపెట్టిపోయినట్లయితే ఆ కొడుకును సులువుగా క్షమించడు. కాని మీరు, నేను అరగొరగా విడిచి వెళ్ళిపోయిన అనేక