పుట:Oka-Yogi-Atmakatha.pdf/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

238

ఒక యోగి ఆత్మకథ

రాజతేజో విరాజమానులైన మా గురుదేవుల మనస్సు కీర్తిమీద కాని, లౌకిక లబ్ధిమీద కేంద్రీకరించి ఉండి ఉంటే ఆయన సులువుగా ఒక రాజాధిరాజో, ప్రపంచాన్ని గడగడలాడించే యోధుడో అయి ఉండేవాడని తరచు అనుకుంటూ ఉండేవాణ్ణి. వాటి బదులు ఆయన, కోపం, అహంభావం అనే ఆంతరిక దుర్గాల్ని కూలగొట్టడానికి పూనుకొన్నారు; వాటి పతనమే మానవుడి ఔన్నత్యానికి నిదర్శనం.