పుట:Oka-Yogi-Atmakatha.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

224

ఒక యోగి ఆత్మకథ

అక్కరలేదు. ఇంద్రియ ప్రలోభాలు, ఎప్పటికీ పచ్చగా ఉండే గన్నేరు మొక్క లాంటివి; సువాసన వెదజల్లుతూ, గులాబి వన్నెపూలు గల ఆ మొక్కలో ప్రతి భాగమూ విషపూరితమైనది.[1] స్వస్థత చేకూర్చే లోకం లోలోపల ఉంటుంది; ఏ సుఖంకోసం బయట వెయ్యి వైపుల మనం గుడ్డిగా వెతుకుతూ ఉంటామో ఆ సుఖం, ఆ లోకంలో ప్రకాశిస్తూ ఉంటుంది.

“తీక్ష్ణమైన బుద్ధి రెండు వేపులా పదునున్న కత్తిలాంటిది;” అని వ్యాఖ్యానించారు గురుదేవు లొకసారి, కుమార్ ఉజ్జ్వల ప్రతిభనుగురించి ప్రస్తావిస్తూ. దాన్ని కత్తిలా, నిర్మాణాత్మకంగానో విధ్వంసాత్మకంగానో అజ్ఞానమనే కురుపు కొయ్యడానికి కాని, తల తెగ్గోసుకోడానికికాని ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మిక నియమం తప్పించుకోడానికి వీలులేనిదన్న సంగతిని మనస్సు అంగీకరించిన తరవాత మాత్రమే బుద్ధి సరయిన మార్గంలో సాగుతుంది.”

మా గురుదేవులు అందరినీ తమ పిల్లల మాదిరిగానే ఆదరిస్తూ, శిష్యులతోటీ శిష్యురాళ్ళతోటీ కూడా స్వేచ్ఛగా కలిసిమెలిసి ఉండేవారు. ఆత్మపరంగా వాళ్ళలో సహనత్వాన్ని గ్రహించి వాళ్ళమధ్య విచక్షణ చూపించడంకాని, పక్షపాతం చూపించడంకాని చేసేవారు కాదు.

“నిద్రలో, నువ్వు ఆడో మొగో నీకు తెలియదు,” అన్నారాయన.

  1. “మానవుడు జాగ్రదవస్థలో ఇంద్రియసుఖాలు అనుభవించడానికి లెక్కలేనన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇంద్రియాలన్నీ అలసిపోయినప్పుడు చేతికందిన సుఖాన్ని కూడా మరిచిపోయి, తన స్వభావమయిన ఆత్మలో విశ్రాంతి అనుభవించడానికి నిద్రపోతాడు.” అని రాశారు. మహావేదాంతి శంకరాచార్యులవారు, “ఆ విధంగా, అతీంద్రియానందం సాధించడం చాలా సులువు; ఎప్పుడూ రోతతోనే అంతమయే ఇంద్రియ సుఖాలకంటె అది చాలా శ్రేష్ఠమైనది.”