పుట:Oka-Yogi-Atmakatha.pdf/190

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతిలో పైసలేని కుర్రవాళ్ళిద్దరు బృందావనంలో

169

పొద్దుట మా ఫలహారాల సమయంలో అది బయట పడింది.

“అయితే, నాన్నగారి ఆస్తితో ప్రమేయం లేకుండా నువ్వు స్వతంత్రంగా ఉండగలవన్న మాట!” నిన్నటి సంభాషణ మళ్ళీ కొనసాగిస్తున్నప్పుడు, అనంతుడి చూపులో అమాయకత ఉంది.

“నేను దేవుడిమీదే ఆధారపడి ఉన్న సంగతి నాకు స్పృహలో ఉంది.”

“మాటలు తేలికే! జీవితం నిన్ను ఇంతవరకు కాపాడింది. నీ కూటికీ గూటికీ, ఆ భగవంతుడి అదృశ్య హస్తం మీద ఆధారపడవలసిన పరిస్థితే వస్తే - ఎంత దురదృష్టం! త్వరలోనే నువ్వు వీధుల్లో బిచ్చమెత్తుకోవలసి వస్తుంది.”

“ఎన్నడూ జరగదు! దేవుణ్ణి కాదని, దారిని పోయేవాళ్ళ మీద విశ్వాసముంచను! తన భక్తుడికోసం ఆయన, భిక్షాపాత్ర ఒక్కటే కాదు, వెయ్యి వనరులు కల్పించగలడు.”

“కవిత్వం వెలగబెడుతున్నావే! ఒకవేళ నేను, నీ డాబుసరి వేదాంతాన్ని ఈ భౌతిక ప్రపంచంలో పరీక్షకి పెడతానంటా ననుకో!”

“ఒప్పుకుంటాను! దేవుణ్ణి ఆలోచనాజగత్తుకే పరిమితం చేస్తావా?”

“సరే, చూద్దాం; నా దృక్పథాన్ని విశాలం చెయ్యడానికో ధ్రువపరచడానికో మీ కీవేళ అవకాశం వస్తుంది.” నాటక ఫక్కిలో ఒక్క క్షణం ఆగి, తరవాత మెల్లగా, గంభీరంగా మాట్లాడాడు.

“ఈ పూట నిన్నూ, నీ తోటి విద్యార్థి జితేంద్రనీ దగ్గర్లో ఉన్న బృందావనమనే ఊరు పంపాలనుకుంటున్నాను. మీరు ఒక్క రూపాయి కూడా వెంట తీసుకెళ్ళకూడదు; అన్నంకాని, డబ్బుకాని ఎవర్నీ అడుక్కో