పుట:Oka-Yogi-Atmakatha.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

137

చిన్న ప్రార్థనతోనే పరమాత్మ సమ్మతిని మధురంగా పొందగలిగిన ఈ నిరాడంబర సాధువు ఎవరు? ఈ లోకంలో ఈయన నిర్వహించే పాత్ర అతిసామాన్యమైనది; నాకు తెలిసినవారందరిలోకి అత్యంత వినయసంపన్నునికి తగ్గట్టుగా ఉంది. అమ్హరెస్ట్ వీధిలో ఉన్న ఈ ఇంట్లో మాస్టర్ మహాశయులు[1] మగపిల్లలకోసం ఒక చిన్న హైస్కూలు నడిపారు. కటువైన మాట ఒక్కటి కూడా ఆయన పెదవి దాటి వచ్చేది కాదు. ఆయన క్రమశిక్షణలో ఏ నియమానికి నింబధనకూ తావు లేదు. నిజానికి, నిరాడంబరమైన ఈ తరగతి గదుల్లోనే ఉన్నత గణితశాస్త్రమూ పాఠ్యపుస్తకాల్లో ఉండని ప్రేమరసాయనశాస్త్రమూ బోధించేవారు. చెవి కెక్కని ఉపదేశాలతో కాకుండా ఆధ్యాత్మిక సంపర్కంతోనే ఆయన తమ జ్ఞానాన్ని వ్యాప్తిచేసేవారు. జగన్మాత మీది పరిశుద్ధ భక్తిపారవశ్యంలో మునిగిపోయిన ఆయన, చిన్నపిల్లవాడి మాదిరిగా, బాహ్యమైన మర్యాద సూచనలేవే అపేక్షించేవారు కారు.

“నేను నీ గురువును కాను; ఆయన కొద్దికాలం తరవాత వస్తారు,” అని చెప్పారు నాకు. “భక్తి ప్రేమలపరంగా నువ్వు పొందే దివ్యానుభవాలు ఆయన మార్గదర్శకత్వంలో, ఆయన ప్రగాఢ వివేకపరంగా వ్యక్తమవుతాయి.”

నేను ప్రతిరోజూ సాయంత్రం, అమ్హరెస్ట్ వీధికి వెళ్తూండేవాణ్ణి. మాస్టర్ మహాశయుల దైవానుభవ చషకం పూర్తిగా నిండి, ప్రతిరోజూ ఆయన ఆనందం నా మీదికి పొంగి పొర్లాలని చూసేవాణ్ణి. ఇంతకు ముందెప్పుడూ నేను, అత్యంత గౌరవభావంతో మోకరిల్లలేదు; ఇప్పుడు

  1. ఆయన్ని మామూలుగా, గౌరవసూచకమైన ఈ పేరుతోనే పిలిచేవారు. ఆయన అసలు పేరు మహేంద్రనాథ్ గుప్త. ఆయన రచించిన పుస్తకాల మీద ఉత్తి ‘ఎం.’ అనే రాసుకొనేవారు.