పుట:Oka-Yogi-Atmakatha.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

138

ఒక యోగి ఆత్మకథ

మాస్టర్ మహాశయుల పాదస్పర్శతో పావనమైన నేలమీద నడవకూడా అపరిమిత భాగ్యంగా అనిపించింది.

“మహాశయా, మీ కోసం ప్రత్యేకంగా అల్లిన ఈ సంపెంగ పూమాల ధరించండి.” ఒకనాడు సాయంత్రం నేను పూలమాల ఒకటి తీసుకవెళ్ళాను. కాని ఆయన వద్దు వద్దంటూ, సిగ్గుపడుతూ దూరంగా జరిగిపోయారు. చివరికి నేను నొచ్చుకోడం గమనించి, చిరునవ్వుతో అంగీకారం తెలిపారు.

“మన మిద్దరం ఆ తల్లి భక్తులమే కనక, నువ్వు, నాలో నివసించి ఆ తల్లికి కానుకగా, నా దేహాలయం మీద ఆ మాల వెయ్యవచ్చు. ఆయన విశాల ప్రకృతిలో, రవ్వంత అహంకారానికి చోటు లేదు.

“మా గురువుగారి వల్ల శాశ్వతంగా పావనమైన దక్షిణేశ్వర కాళికాలయానికి వేళ్దాం, రేపు.” ఈ సాధువు, క్రీస్తువంటి గురువర్యులయిన శ్రీరామకృష్ణ పరమహంస శిష్యులు.

ఆ మర్నాడు పొద్దున, గంగానదిలో నాలుగు మైళ్ళు ప్రయాణం చేయడానికి పడవమీద బయలుదేరాం. తొమ్మిది గుమ్మటాలతో విరాజిల్లుతున్న కాళికాలయంలోకి ప్రవేశించాం. అందులో వెండితో చేసిన తామర పువ్వుమీద, జగజ్జనని విగ్రహం, శివుడి విగ్రహం ఉన్నాయి. తామర పువ్వు కున్న వెయ్యి రేకులూ అతి నేర్పుగా చెక్కి ఉన్నాయి. మాస్టర్ మహాశయులు మంత్రముగ్ధులైనట్టుగా భాసించారు. ప్రేమమయి అయిన జగన్మాత అనంత ప్రణయలీలలో ఆయన నిమగ్నులయిపోయారు. ఆయన ఆ అమ్మవారి పేరు గానం చేస్తుంటే భావోద్రిక్తమైన నా హృదయం, ఆ తామరపువ్వులాగే, వెయ్యి రేకులుగా విడివడిపోయినట్లనిపించింది.

తరవాత మే మిద్దరం, పవిత్రమయిన ఆ ఆలయ ప్రాంగణంలో తిరుగుతూ ఈత (ఝావుక) చెట్ల తోపులో ఆగాం. ఈ చెట్లనుంచి సహ