పుట:Oka-Yogi-Atmakatha.pdf/156

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆనందభరిత భక్తుడు, ఆయన విశ్వప్రేమలీల

135

హృదయం పగిలింది ఇక్కడే. మళ్ళీ ఈనాడు ఇక్కడే, జగన్మాత కనబడనందుకు నా అంతరాత్మ, శిలువ వేసినంత బాధతో విలవిల్లాడిపోయింది, పావనమైన గోడలు! నన్ను బాధించిన గాయాలకీ, చివరి ఉపశమనానికి మౌనసాక్షులివి.

గుర్ఫార్ రోడ్డులో ఉన్న ఇంటికి తిరిగి వెళుతూ ఉంటే నా అడుగుల వడి పెరిగింది. మిద్దెమీద నా చిన్న గదిలో ఏకాంతంగా, పదిగంటల వరకు ధ్యానంలో ఉండిపోయాను. భారతదేశపు వెచ్చని రాత్రిపూట అలుముకొన్న చీకటిని పటాపంచలు చేస్తూ అద్భుతమైన దృశ్యం ఒకటి హఠాత్తుగా వెలుగొందింది.

వెలుగులు వెదజల్లుతూ జగన్మాత నా ఎదురుగా నిలిచింది. మెత్తని చిరునవ్వు చిందిస్తున్న ఆవిడ ముఖం, రూపుగట్టిన సౌందర్యమే.

“ఎప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే వచ్చాను! ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను!”

దివ్యస్వరాలు ఇంకో గాలిలో ఆడుతూ ఉండగానే ఆమె అంతర్ధానమై పోయింది.

మర్నాడు పొద్దున నేను, మాస్టర్ మహాశయుల్ని రెండోసారి దర్శించే సమయానికి సూర్యుడింకా సరిగా ఉదయించనే లేదు. గాఢమైన స్మృతులతో కూడిన ఆ ఇంటి మేడమెట్లు ఎక్కుతూ నాలుగో అంతస్తులో ఉన్న గదికి చేరాను. గది తలుపు మూసి ఉంది. తలుపు గుబ్బమీద ఒక గుడ్డ చుట్టి ఉంది. ఆ సమయంలో మహాశయులు ఏకాంతం కోరుతున్నారనిపించింది. ఏం చేయ్యడానికి పాలుపోక, నేను గుమ్మం ముందర నించుని ఉండగా, మాస్టర్ మహాశయులే స్వయంగా తలుపు తెరిచారు. ఆయన పవిత్ర పాదాలముందు మోకరిల్లాను. నాలోని దివ్యానందాన్ని