పుట:Oka-Yogi-Atmakatha.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

120

ఒక యోగి ఆత్మకథ

బడ నివ్వకుండా, నాకు తప్పకుండా విజయాన్ని చేకూర్చగల భౌతిక శాస్త్రానికే పరిమితం చేసుకోడం మంచిదని సలహా ఇచ్చారు. నేను అనుకోకుండా, అపరిచితమైన కులవ్యవస్థలోకి చొరబడి, దాని మర్యాదకు భంగం కలిగించాను.

“అజ్ఞానాన్ని విశ్వాసంతో కలిపి గందరగోళపరిచే దైవశాస్త్రపరమైన పక్షపాతం కూడా ఒకటి అనుకోకుండా పనిచేస్తోంది. నిరంతర పరిణామశీలమైన సృష్టి రహస్యంతో మనల్ని ఆవరించి ఉన్న భగవంతుడు, ప్రశ్నించి తెలుసుకోవాలన్న కోరిక కూడా మనలో పాదుగొలిపాడన్న విషయాన్ని తరచుగా మరిచిపోతుంటాం. నేను అనేక సంవత్సరాల పాటు ఇతరుల అపార్థానికి గురి అయినమీదట, విజ్ఞానశాస్త్రాన్ని ఆరాధించే శాస్త్రవేత్తల జీవితం, అందులేని సంఘర్షణ అని తెలుసుకున్నాను, కష్టనష్టాల్ని జయాపజయాల్నీ ఒక్కటిగానే భావించి, జీవితాన్ని అతడు భక్తిపూర్వకంగా అర్పణ చేసుకోవాలి.

“కొంతకాలానికి, ప్రపంచంలో ఉన్న ప్రముఖ వైజ్ఞానిక సంఘాలు నా సిద్ధాంతాల్నీ, ఫలితాల్నీ అంగీకరించాయి; విజ్ఞానశాస్త్రానికి భారతీయులు చేసిన దోహదాన్ని గుర్తించాయి. ఏదో స్వల్పమైనది లేదా గిరిగీసి పెట్టినది, భారతీయమైన మనస్సుకు ఎన్నడయినా తృప్తి నియ్య గలదా? ఈ దేశం, అవిచ్ఛిన్నమైన సజీవ సంప్రదాయంవల్లా పునరుజ్జీవన శక్తిపట్లా లెక్కలేనన్ని మార్పులకు లోనయి మళ్ళీ సర్దుబాట్లు చేసుకుంది. భారతీయు లెప్పుడూ, పక్కన ఉన్న తాత్కాలిక లాభాన్ని విడిచిపెట్టి జీవితంలో అత్యున్నత ఆదర్శాల్ని అందుకోడానికే- అదికూడా, నిష్క్రియాత్మకమైన త్యాగంద్వారా కాక, సక్రియాత్మకమైన సంఘర్షణ ద్వారా సాధించడానికే- దీక్ష వహిస్తూ వచ్చారు. ఏమీ సాధించకుండా, సంఘర్షణను నిరాకరించే దుర్బలుడికి త్యాగం చెయ్యడానికి ఏమీ