పుట:Oka-Yogi-Atmakatha.pdf/140

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త, సర్ జగదీశ్‌చంద్ర బోసు

119

అంకితమైనది. అందులో విగ్రహమేదీ ప్రతిష్ఠ కాకపోవడం, భగవంతుడి నిరాకారతను సూచిస్తుంది.

ఆ మహోత్సవంలో బోసు ఇచ్చిన ఉపన్యాసం, దైవప్రేరితులైన సనాతన ఋషుల నోటినుంచి వెలువడ్డట్టుగా ఉంది.

“ఈనాడు నేను ఈ సంస్థను కేవలం ఒక ప్రయోగశాలగా మాత్రమే కాకుండా, ఒక దేవాలయంగా అంకితం చేస్తున్నాను.” భక్తిశ్రద్ధాభరితమైన ఆయన గాంభీర్యం, జనంతో క్రిక్కిరిసి ఉన్న ప్రేక్షకమందిరం మీద, కంటికి కనరాని ఆచ్ఛాదనలా భాసించింది. “నా పరిశోధన కృషిలో, నా దారి అనుకోకుండా, భౌతికశాస్త్రానికి శరీరధర్మశాస్త్రానికి మధ్య సరిహద్దు ప్రాంతంలోకి సాగింది. సజీవ జగత్తుకూ నిర్జీవ జగత్తుకూ మధ్య సరిహద్దు రేఖలు మాయమవడమే కాక అవి కలిసిపోయే స్థానాలు బయల్పడటం గమనించి ఆశ్చర్యపోయాను. నిర్జీవ పదార్థం జడేతరంగా, అసంఖ్యాక శక్తుల చర్యకు గురిఅయి సంస్పందిస్తున్నట్లు గోచరించింది.

“లోహాన్నీ మొక్కనూ జంతువునూ ఒకే సామాన్య సూత్రం కిందికి తేవడానికి సార్వత్రికమైన ప్రతిచర్య ఒకటి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇవన్నీ ప్రధానంగా ఒకే విధమైన అలసట, కుంగుదల లక్షణాలను కనబరచడమే కాక, అలసటనుంచి తేరుకోడానికి పెరుగుదల పొందడానికి, మరణ సంబంధమైన శాశ్వత జడత్వం వహించడానికి గల అవకాశాలను కూడా కనబరిచాయి. అత్యద్భుతమైన ఈ సాధారణీకరణంతో ఆశ్చర్యంలో మునిగి, నా ఫలితాల్ని - అంటే, ప్రయోగాల్లో వెల్లడి అయిన ఫలితాల్ని- గొప్ప ఆశాభావంతో రాయల్ సొసైటీ -వారి ముందు ఉంచాను. కాని అక్కడికి వచ్చిన శరీరధర్మశాస్త్రవేత్తలు, నేను నా పరిశోధనల్ని, వాళ్ళ సంరక్షణలో ఉన్న రంగంలోకి అక్రమంగా చొర