పుట:Oka-Yogi-Atmakatha.pdf/135

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

114

ఒక యోగి ఆత్మకథ

తరవాత నా జీవిత కథలో అనేక సంవత్సరాలు గడిచాక జరిగిన ముచ్చట ఒకటి ఇక్కడ మనవి చేస్తాను. భాదురీ మహాశయులు చివరిసారిగా నాకు చెప్పిన మాటలవి. నేను పాశ్చాత్యదేశాలకు బయలుదేరడానికి కొద్దిగా ముందు, ఆయన్ని వెతుక్కుంటూ వెళ్ళి, వీడుకోలు దీవెనలకోసం వినయంగా ఆయన ముందు మోకరిల్లాను.

“నాయనా, అమెరికా వెళ్ళు, సనాతన భారతదేశం ఘనతని నీకు కవచంగా తీసుకువెళ్ళు, విజయం నీ నుదుట రాసి ఉంది. దూరదేశాల సజ్జనులు నిన్ను బాగా ఆదరిస్తారు.”