పుట:Oka-Yogi-Atmakatha.pdf/136

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యాయం : 8

ప్రఖ్యాత భారతీయ శాస్త్రవేత్త,

సర్ జగదీశ్ చంద్ర బోసు

“జగదీశ్‌చంద్ర బోసు కనిపెట్టిన నిస్తంత్రి పరికరాలు మార్కొనీ వాటికంటె ముందటివే.”

రెచ్చగొట్టేటట్టున్న ఈ వ్యాఖ్యానం చెవిని పడగానే, దారి పక్కన నించుని శాస్త్రచర్చ జరుపుతున్న ఆచార్యుల బృందానికి దగ్గరగా వెళ్ళాను. వాళ్ళతో కలవడానికి నాలో కలిగిన ప్రేరణ జాతి దురహంకారమే. అయితే దానికి నేను విచారించవలసిందే. కాని కేవలం అధిభౌతికశాస్త్రం లోనే కాకుండా భౌతికశాస్త్ర రంగంలో కూడా భారతదేశం ప్రముఖ పాత్ర వహించగలదన్న విషయానికి సాక్ష్యం ఉందంటే, దాని మీద నాకు గాఢమైన ఆసక్తి లేదని చెప్పలేను.

“అంటే మీ అభిప్రాయం ఏమిటండీ?”

ప్రొఫెసరుగారు నా కోరిక మన్నించి ఇలా వివరించారు: నిస్తంత్రీ సంయోజకాన్నీ, విద్యుత్ తరంగాల వక్రీభవన సూచక పరికరాన్ని కనిపెట్టడంలో బోసు మొట్టమొదటివారు. కాని ఈ భారతీయ శాస్త్రవేత్త, తాను కనిపెట్టినవాటి మీద వ్యాపారంచేసి డబ్బు గడించడానికి పూనుకోలేదు. త్వరలోనే ఆయన, నిర్జీవ ప్రపంచం మీంచి సజీవ ప్రపంచం మీదికి దృష్టి మళ్ళించారు. వృక్షశరీరధర్మ శాస్త్రజ్ఞుడుగా ఆయన కని