పుట:Oka-Yogi-Atmakatha.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

110

ఒక యోగి ఆత్మకథ

సూచనలకు పూర్తి అర్థం, ఇప్పుడే – ఈ మాటలు రాస్తూ ఉన్నప్పుడే తెలుస్తోంది.

“మహాఋషీ, ప్రపంచానికి లాభం కలగడానికి, యోగశాస్త్రాన్ని గురించి మీరొక పుస్తకం రాస్తే బాగుండు ననిపిస్తోంది.”

“నేను శిష్యుల్ని తయారుచేస్తున్నాను. వాళ్ళూ వాళ్ళ శిష్యపరంపరా, కాలక్రమాన జరిగే సహజ విచ్ఛిత్తులనూ విమర్శకుల అసహజ వ్యాఖ్యానాలనూ తప్పని నిరూపించే సజీవ గ్రంథాలుగా నిలుస్తారు.”

సాయంకాలం ఆయన శిష్యుడు వచ్చేవరకు ఆ యోగి దగ్గర నేను ఒక్కణ్ణే ఉన్నాను. భాదురీ మహాశయులు ప్రసంగం ప్రారంభించారు; ఆయన ప్రసంగాలు సాటిలేనివి. వినేవాళ్ళ మనస్సుల్లో ఉండే చెత్తనంతా తుడిచిపెట్టేసి దేవుడివేపు తేలుతూ పోయేటట్టు చేసే ప్రశాంతమైన వరద వెల్లువ మాదిరిగా ప్రసంగించారాయన. ఆయన స్వచ్ఛమైన బెంగాలీలో, మనస్సుకు హత్తుకుపోయే నీతికథలు చెప్పారు.

ఈ సాయంత్రం భాదురీ మహాశయులు, మీరాబాయి జీవితానికి సంబంధించిన వివిధ తాత్త్విక విషయాల్ని వివరించారు. మీరాబాయి మధ్య యుగంలో జీవించిన రాజపుటానీ రాజకుమారి; సాధుసజ్జన సాంగత్యం కోసం ఈమె రాజభోగాల్ని కూడా విడిచిపెట్టేసింది. సనాతన గోస్వామి అనే గొప్ప సన్యాసి ఒకాయన, ఈమె ఆడది కాబట్టి దర్శన మివ్వడానికి నిరాకరించాడు. దానికి ఈమె ఇచ్చిన జవాబుతో ఆయనే తలవంచుకొని ఈమె పాదాల దగ్గరికి రావలసి వచ్చింది.

“మీ స్వాములవారికి చెప్పండి,” అన్న దామె, “ఈ విశ్వంలో దేవుడు తప్ప మరో మగవాడెవరూ ఉన్నట్టు నాకు తెలియదు; ఆయన ముందు మన మందరం ఆడవాళ్ళం కామా?” (ఏకైక సృష్టికర్త దేవుడే