పుట:Oka-Yogi-Atmakatha.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలిలో తేలే సాధువు

111

ననీ, ఆయన సృష్టి అంతా స్తబ్ధమైన మాయ తప్ప మరేమీ కాదనీ పవిత్ర గ్రంథాలు వెల్లడించే భావన).

మీరాబాయి ఆనంద పారవశ్యంతో అనేక కీర్తనలు కట్టింది; వాటిని ఈనాటికీ భారతదేశంలో పదిలపరుచుకుంటారు. వాటిలో ఒకటి కింద అనువదిస్తాను :

“ప్రతినిత్యం స్నానంచేస్తేనే దేవుడు సాక్షాత్కరించేటట్టయితే
 వెంటనే నేను తిమింగిలాన్నవుతాను, అఖాతంలో;
 దుంపలూ పళ్ళూ తిన్నంత మాత్రాన తెలిసేటట్టయితే ఆయన,
 నేను మేకజన్మ ఎత్తితేనే బాగుండు ననుకుంటాను;
 జపమాల తిప్పితేనే ఆయన బయటపడతాడంటే
 రాకాసి పూసల పేరుతోనే జపాలు చేస్తాను;
 రాతిబొమ్మలకు మొక్కడంవల్లనే ఆయన తెరమరుగు విడుస్తాడంటే
 పాషాణమయమైన పర్వతాన్నే పూజిస్తాను సవినయంగా;
 పాలు తాగితేనే ఆయన్ని ఒంటబట్టించుకోవచ్చునంటే
 ఎన్నో పాడిదూడలకూ పసిపిల్లలకూ ఆయనీపాటికి తెలిసిపోయే ఉండాలి;

 సతిని విడిచిన మాత్రాన దేవుడికి పిలుపందుతుందంటే
 వేలకొద్దీ జనం నపుంసకులయిపోరా మరి?
 మీరాబాయికి తెలుసు, దేవుణ్ణి కనుక్కోడానికి
 తప్పకుండా ఉండవలసింది, ప్రేమ ఒక్కటేనని.”

భాదురీ మహాశయులు యోగాసనంలో కూర్చుని ఉండగా, చాలా మంది విద్యార్థులు, ఆయన పక్కన ఉన్న పాంకోళ్ళలో రూపాయలు పెట్టారు. భారతదేశంలో సంప్రదాయ ప్రకారంగా భక్తితో ఇలా సమర్పించడమన్నది, శిష్యుడు తన భౌతిక సంపత్తిని గురువుగారి పాదాల ముందు