పుట:Nutna Nibandana kathalu.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


అదే సమయంలో అన్నా అనే భక్తురాలు కూడ దేవాలయానికి వచ్చింది. ఆమె మెస్సీయా రాకడ కొరకు కాచుకొనివున్న వాళ్లందరికీ ఆ బాలుణ్ణి చూపించి ఇతడే మెస్సీయా అని తెలియజేసింది. దేవుణ్ణి కొనియాడింది. అటుపిమ్మట తల్లిదండ్రులు బాలుణ్ణి తీసికొని నజరేతుకి తిరిగివచ్చారు.


8. జ్ఞానులు శిశువుని సందర్శించడం -మత్త 2,1-12


హేరోదు రాజు పరిపాలనా కాలంలో జ్ఞానులు క్రొత్తచుక్కను ఆనవాలుగా పెట్టుకొని తూర్పుదేశం నుండి బయలుదేరి యెరూషలేముకు వచ్చారు. మేము యూదుల రాజుగా పుట్టిన శిశువుని ఆరాధించడానికి వచ్చాం. అతడు ఎక్కడ పుట్టాడో చెప్పమని హేరోదుని అడిగారు. ఆ రాజు జ్ఞానులను ప్రోగుజేయగా వాళ్లు క్రీస్తు బేల్లెహేములో పుడతాడని మీకా ప్రవక్త వ్రాశాడని తెలియజేశారు. హేరోదు జ్ఞానులతో మీరు వెళ్లి శిశువుని కనుగొని మళ్లా నాకు సమాచారం తెలియజేయండి. నేను గూడ వెళ్లి అతన్ని ఆరాధిస్తాను అని చెప్పాడు. నక్షత్రం మళ్లా వారిని నడిపించుకొని పోయి శిశువు వున్న స్థలం దగ్గర ఆగింది. వాళ్లు బాలుని దర్శించి ఆరాధించి కానుకలు సమర్పించారు. దేవుడు హేరోదు దగ్గరికి వెళ్లవద్దని హెచ్చరింపగా ఆ జ్ఞానులు వేరే త్రోవన తమ దేశానికి వెళ్లిపోయారు.


9. హేరోదు పసిబిడ్డలను చంపించడం - మత్త 2,13-18


జ్ఞానులు వెళ్లిపోయిన పిదప దేవదూత యోసేఫుకి కలలో కన్పించి హేరోదు శిశువుని చంపగోరుతున్నాడు. నీవు అతన్ని తీసికొని ఈజిప్టుకి వెళ్లిపో అని చెప్పాడు. యోసేఫు ఆ రాత్రే తల్లీ బిడ్డలతోపాటు ఈజిప్టుకి వలసపోయాడు.

ఇక్కడ హేరోదు జ్ఞానులు తన్ను మోసగించారని భావించి మండి పడ్డాడు. బేత్తెహేములోను దాని దరిదాపుల్లోను వున్న రెండేండ్ల లోపులోని బాలకులందరిని చంపివేయండని ఆజ్ఞాపించాడు. అతని బంటులు అలాగే చేశారు. ఆ బిడ్డలతోపాటు క్రీస్తు-శిశువు కూడ మరణిస్తాడని రాజు