పుట:Nutna Nibandana kathalu.pdf/8

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది6. గొర్రెల కాపరుల సందర్శనం -లూకా 2,8-19


బేత్లెహేము దరిదాపుల్లో రాత్రిపూట గొర్రెల కాపరులు మందలకు కాపలా కాస్తున్నారు. దేవదూత వారికి దర్శనమిచ్చాడు. అక్కడ పెద్ద వెలుగు ప్రకాశించింది. దూత వారితో మీరు మీరు భయపడకండి. నేడు దావీదు నగరమైన బేత్తెహేములో రక్షకుడైన క్రీస్తు పుట్టాడు. పొత్తిగుడ్డల్లో చుట్టబడి వున్న శిశువు మీకు పశువుల తొట్టిలో కన్పిస్తాడు అని చెప్పాడు. అంతలోనే పెద్ద దేవదూతల సమూహం కూడ కన్పించి దేవుణ్ణి స్తుతించింది. కాపరులు ఉత్సాహంతో బేత్తెహేమువచ్చి దూత చెప్పినట్లుగానే తొట్టిలో పరుండి వున్న శిశువుని చూచి సంతోషించారు. ఇరుగు పొరుగు వాళ్లకు కూడ ఈ సమాచారం తెలియజేయగా వాళ్లు ఆశ్చర్యపోయారు. తల్లి మరియ ఈ సంగతులన్నీ హృదయంలో దాచుకొని వాటిని గూర్చి లోతుగా ఆలోచిస్తూ ఉంది.

7. దేవాలయంలో శిశువు సమర్పణం - లూకా 2,22-40

40 రోజుల తర్వాత తల్లిదండ్రులు యేసు శిశువుని దేవునికి సమర్పించడానికి యెరూషలేము దేవాలయానికి తీసికొని వచ్చారు. రెండు గువ్వలను గూడ కానుకగా కొనివచ్చారు. ఆ రోజుల్లో యెరూషలేములో సుమియోను అనే భక్తుడు ఉండేవాడు. అతడు మెస్సీయా రాకడకొరకు కనిపెట్టుకొని వున్నాడు. పవిత్రాత్ముడు నీవు మెస్సీయాను కంటితో చూచినదాక బ్రతికి వుంటావని అతనికి వరమిచ్చాడు. ఆత్మ ప్రేరితుడై సుమియోను దేవళానికి వచ్చిబాలుని చేతుల్లోకి తీసికొని నేడు నేను ప్రభువు రక్షణాన్ని కన్నులార చూచాను గదా అని దేవుణ్ణి స్తుతించాడు. ఇంకా అతడు మరియతో ఈ బాలుని వలన కొందరికి రక్షణమూ, కొందరికి శిక్షా ప్రాప్తిస్తాయి. ఇతని వలన నీ హృదయానికి కూడ గొప్ప వేదన కలుగుతుంది అని ప్రవచించాడు.