పుట:Nutna Nibandana kathalu.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పన్నాగం. అటుపిమ్మట హేరోదు మరణించాడు. దేవదూత ఈజిప్టులోని యోసేఫుకి మరల కలలో కన్పించి శిశువుకి కీడు తలపెట్టినవాళ్లు గతించారు. ఇక నీవు సొంతదేశానికి వెళ్లిపోవచ్చు అని చెప్పాడు. యోసేఫ తల్లీ బిడ్డలతో పాటు యిప్రాయేలు దేశానికి తిరిగివచ్చి నజరేతు గ్రామంలో స్థిరపడ్డాడు.


10. దేవాలయంలో యేసు - లూకా 2,41-52

బాలయేసుకి పండ్రెండేండ్లు వచ్చినప్పడు తల్లిదండ్రులు అతన్ని దేవాలయానికి తీసికొని పోయారు. తిరుగు ప్రయాణంలో యేసు దేవాలయంలోనే వుండిపోయాడు. తల్లిదండ్రులు ఆ సంగతి గ్రహించక తోడియాత్రికులతో ఒకరోజు ప్రయాణం చేశారు. ఆ పిమ్మట కుమారుని కొరకు వెతకగా అతడు కన్పించలేదు. విచారంతో మళ్లా యెరూషలేముకి తిరిగివచ్చి అక్కడ అతని కొరకు గాలించారు. మూడవరోజు అతడు దేవాలయంలో వేదశాస్రుల మధ్య కూర్చుండి వారి బోధలు ఆలకిస్తూండగా చూచారు. తల్లి మరియ కుమారా! మీ నాయన నేను విచారంతో నీ కొరకు వెదుకుతున్నాం. నీవు మమ్మ విడిచిపెట్టి ఇక్కడ ఎందుకున్నావు అని అడిగింది. యేసు నేను నా తండ్రి పనిలో వుండాలి కదా! మీరు నా కోసం ఎందుకు వెదికారు అని బదులు పలికాడు. అతని పలుకులు వారికి అర్థం ෆජ්ඨ. ෂ పిమ్మట నజరేతుకు తిరిగివచ్చి తల్లిదండ్రులు చెప్పినట్లుగా నడుచుకొన్నాడు.

11. స్నాపక యోహాను బోధ - మత్త 8,1-8, యోహా 1,19-27

క్రీస్తు బహిరంగ జీవితం ప్రారంభించి బోధ చేయడానికి సిద్ధ మౌతున్నాడు. అతనికి మార్గం తయారు చేయడానికి స్నాపక యోహాను ముందుకు వచ్చాడు. అతడు యోర్గాను నది సమీపంలో బోధ ప్రారంభిం చాడు. మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడి జ్ఞానస్నానం పొందండని హెచ్చరించాడు. అతడు ఏలియా ప్రవక్త లాగె ఒంటె రోమాల కంబళిని