పుట:Nutna Nibandana kathalu.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కాని యూదులు అసూయ చెంది పౌలు మీద గలాటా లేవదీశారు. అతనికి ఆశ్రయమిచ్చిన యాసోనుని చెరలో పెట్టించారు. పౌలు సీలాలు అక్కడి నుండి బెరయాకు వెళ్లి ప్రార్థనా మందిరంలో క్రీస్తుని బోధించారు. అచటి ప్రజలు విశాలహృదయులు. పౌలుబోధను సావధానంగా విని అతడు చెప్పింది నిజమా కాదా అని తెలిసికోడానికి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలించి చూచారు. అక్కడ గూడ చాలమంది క్రీస్తుని విశ్వసించారు. కాని తెస్సలోనిక యూదులు అక్కడికి కూడ వెళ్లి జనాన్ని రెచ్చగొట్టి పౌలుబోధకు ఆటంకం కలిగించారు. పౌలు అక్కడినుండి ఆతెన్సు నగరానికి వెళ్లాడు.

అక్కడి యూదుల ప్రార్థనా మందిరంలోను సంతవీధుల్లోను బోధించాడు. ఆ నగర పౌరులకు క్రొత్త విషయాలు తెలిసికోవాలనే కోరిక ప్రబలంగా వుండేది. కనుక అక్కడి తత్వవేత్తలు అతన్ని అరియోపగ అనే తమ మహాసభకు తీసికొని పోయారు. ఆ నగరంలో అజ్ఞాత దేవునికి ఓ బలిపీఠం ఉంది. పౌలు ఆ యజ్ఞాత దేవుణ్ణి గూర్చే నేను మాటలాడు తున్నానని చెప్పి ఉపన్యాసం ప్రారంభించాడు. దేవుడు క్రీస్తుని ఉత్థానం చేశాడని చెప్పాడు. గ్రీకు ప్రజలు ఉత్థానాన్ని నమ్మరు. కనుక అక్కడివాళ్లు పౌలుని ఎగతాళి చేసి మేము ఇంకోసారి నీ బోధ వింటాంలే అన్నారు. ఆ నగరంలో ఇద్దరు ముగ్గురు మాత్రం ప్రభువుని విశ్వసించారు. ఇక్కడ పౌలు విఫలుడయ్యాడు.

అతడు ఆతెన్సు నుండి కొరింతుకు వెళ్లాడు. అక్కడ అక్విల ప్రిసిల్ల దంపతులతో కలసి జీవించాడు. వాళ్లందరూ గుడారాలు తయారు చేసేవాళ్లే. పౌలు మొదట యూదులకు బోధించినా వాళ్లు వినలేదు. అటుపిమ్మట గ్రీకు ప్రజలకు బోధింపగా వాళ్లు విన్నారు. కొరింతులో ప్రభువు అతనికి దర్శనమిచ్చి ఈ నగరంలో నా భక్తులు చాలమంది వున్నారు. నీవు బోధ ఆపవద్దు. నేను నీకు సహాయం చేస్తాను అని