పుట:Nutna Nibandana kathalu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వంశస్థుడైన యోసేపుకి ప్రదానం చేశారు. దేవదూత అమ్మా! నీవు దేవుని అనుగ్రహానికి నోచుకున్నావు. ప్రభువు నీకు తోడుగా వుంటాడు. నీకు శుభం అని పల్కాడు. మరియు భయపడి దూత సందేశం భావం ఏమిటా అని ఆలోచిస్తుండగా అతడు అమ్మా! భయపడకు. నీవు గర్భందాల్చి కుమారుని కంటావు. అతనికి యేసు అని పేరుపెట్టాలి. అతన్ని దేవుని కుమారుడు అని పిలుస్తారు. దేవుడు దావీదు సింహాసనాన్ని అతనికి దయచేస్తాడు అని చెప్పాడు.

మరియ నేను కన్యను గదా! నాకు బిడ్డడు ఏలాపుడతాడు అని అడిగింది. గబ్రియేలు ఆ శిశువు పవిత్రాత్మ శక్తివలన జన్మిస్తాడు. కనుక అతన్ని దేవుని కుమారుడు అని పిలుస్తారు. నీ బంధువు ఎలిసబేతు ఉంది కదా! గొడ్రాలుగా వుండిపోయిన ఆమె ఆరునెలల క్రితమే గర్భం ధరించింది. ఈ కార్యం దేవుని శక్తి వలన జరిగింది సుమా అని చెప్పాడు.

ఆ పలుకులు విని మరియ ఇదిగో నేను ప్రభువు దాసురాలిని. నీవు చెప్పినట్లే జరగనీయి అని తన సమ్మతిని తెలియజేసింది. అంతట దేవదూత మరుగైపోయాడు.

అదే గ్రామంలో వసించే యోసేఫుకు దేవుడు మరియను కరుణించా డని తెలియదు. కనుక ప్రభువు దూత అతనికి కలలో కన్పించి దావీదు వంశస్థుడైన యోసేఫూ! నీవు మరియను చేపట్టడానికి సందేహించ వద్దు. ఆమె పవిత్రాత్మ శక్తి వలన గర్భం ధరించింది. ఆమెకు పుట్టబోయే శిశువుకి యేసు అని పేరు పెట్టాలి. అతడు ప్రజలను పాపం నుండి రక్షిస్తాడు అని చెప్పాడు - మత్త 1,20-21

3. మరియ ఎలిసబేతుని సందర్శించడం– లూకా 1,39–45

దూత సందేశాన్ని విన్న తర్వాత మరియు ప్రయాణమై గబగబ యెలిసబేతు ఇంటికి వెళ్లి ఆమెను అభినందించింది. ఆమె పలుకులు వినగానే ఎలిసబేతు గర్భంలోని శిశువు ఆనందంతో కదిలాడాడు. ఎలిసబేతు ఆత్మ