పుట:Nutna Nibandana kathalu.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ప్రేరణం వలన అమ్మా! నీవు స్త్రీలందరిలోను ధన్యురాలివి. నీకు పుట్టబోయే శిశువు దీవెనలు పొందుతాడు. నా ప్రభువు తల్లి నన్ను సందర్శించడానికి రావడం ఎంత భాగ్యం! ప్రభువు సందేశాన్ని శంకించక నమ్మిన నీవు నాలు యోగ్యురాలివి కడా అని పల్కింది. దేవుడు తన్ను కరుణించినందుకు మరియు కూడ అతన్ని స్తుతించింది.

4. యోహాను జననం - లూకా 1,59-65


దేవదూత చెప్పినట్లే యొలిసబేతు కుమారుని కంది. బిడ్డడు పుట్టినందుకు ఇరుగుపొరుగువాళ్లు ఆనందించారు. ఎన్మిదవనాడు శిశువుకి సున్నతి చేసి జెకర్యా అని పేరు పెట్టబోయారు. కాని తల్లి అతనికి యోహాను అనే పేరు పెట్టాలని చెప్పింది. కుమారునికి ఏమి పేరు పెట్టమంటావని తండ్రిని అడగ్గా అతడు మాటలాడలేక పలకమీద యోహాను అని వ్రాసి యిచ్చాడు. కనుక బిడ్డడికి ఆ ੇ పెట్టారు. వెంటనే జకర్యా నాలుక పట్టు సడలగా అతడు దేవుణ్ణి స్తుతించాడు. అద్భుతంగా పుట్టిన ఆ బిడ్డడు తర్వాత ఎంత గొప్పవాడు ఔతాడో గదా అని ప్రజలు విస్తుపోయారు.

5. యేసు జననం - లూకా 2,1-7

ఆ రోజుల్లో అగుస్తు చక్రవర్తి జనాభా లెక్కలు సేకరించమని అధికారులను ఆజ్ఞాపించాడు. కనుక పేర్లు నమోదు చేయించు కోవడానికి ప్రజలందరు తమతమ పూర్వ పట్టణాలకు వెళ్లారు. యోసేపు దావీదు వంశస్థుడు కదా! కనుక అతడు దావీదు నగరమైన బేత్తెహేముకి తనకు ప్రదానం చేయబడిన మరియతోపాటు వెళ్లాడు. ఆమె పూర్ణ గర్భవతి. చాలమంది జనం పేర్లు వ్రాయించుకోవడానికి వచ్చినందున వారికి ఆ వూరి సత్రంలో చోటు దొరకలేదు. అక్కడే మరియు తొలిచూలు కుమారుణ్ణి కని పొత్తిగుడ్డల్లో చుట్టి పశువులకు మేతవేసే రాతి తొట్టిలోనే పరుండ బెట్టింది. ఆలా దేవాధిదేవుడు ఓ పేదనరుడుగా జన్మించాడు. ○