పుట:Nutna Nibandana kathalu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సూత నిబంధన కథలు

1. గబ్రియేలు యోహాను జననాన్ని ఎరిగించడం - లూకా 1,5-25

హేరోదు పరిపాలనా కాలంలో యూదియా రాష్ట్రంలో జెకర్యా అనే యూజకుడు ఉండేవాడు. అతని భార్య ఎలిసబేతు. వాళు భక్తితో జీవించేవాళ్లు. ఐనా సంతానం లేకపోవడం వారికి పెద్ద బాధ ఐంది. ఇద్దరూ వృద్ధులు. ఒకనాడు జెకర్యా దేవాలయంలో పీఠంమీద దేవునికి సాంబ్రాణి పొగ వేస్తుండగా దేవదూత దర్శనమిచ్చాడు. అతడు జెకర్యా! దేవుడు నీ మొరాలించాడు. నీ భార్య గర్భం ధరించి కుమారుని కంటుంది. అతనికి యోహాను అని పేరు పెట్టాలి. అతడు నాజరేయ వ్రతాన్ని పాటించి దేవునికి సేవలు చేస్తాడు అని చెప్పాడు.

జెకర్యా అయ్యా! మేమిద్దరం వృదులం. మాకు బిడ్డడు ఎలా కలుగుతాడు అని అడిగాడు. దేవదూత నా పేరు గబ్రియేలు. నేను దేవుని సన్నిధిలో సేవలు చేసేవాణ్ణి. ప్రభువే నన్ను き。 దగ్గరికి పంపాడు. నీవు దేవుని సందేశాన్ని నమ్మలేదు కనుక బిడ్డడు పుట్టేవరకు మూగవాడివిగా వుంటావు అని పల్కి అదృశ్యమయ్యాడు.

ఇంతలో ప్రజలు దేవళం వెలుపల జకర్యా కొరకు వేచివున్నారు. అతడు జనం దగ్గరికి వచ్చినపుడు వారితో మాటలాడలేక సైగలు చేశాడు. ప్రజలు అతనికి దేవళంలో దైవదర్శనం కలిగిందని గ్రహించారు. అటు పిమ్మట జకర్యా ఇంటికి వెళ్లిపోయాడు. దేవదూత చెప్పినట్లే యెలిసబేతు గర్భం ధరించింది.

2. గబ్రియేలు యేసు జననాన్ని ఎరిగించడం - లూక 1,26-38

ఆరునెలలు గడిచాక గబ్రియేలు గలిలయ రాష్ట్రంలోని నజరేతు గ్రామంలో వసించే మరియ అనేశ్ర వచ్చాడు. ఆమెను దావీదు