పుట:Nutna Nibandana kathalu.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

88. మోక్షారోహణం - అచ 1,1-11

క్రీస్తు ఉత్థానమయ్యాక చాలసార్లు శిష్యులకు కన్పించాడు. అందరికీ సువార్తను బోధించమని చెప్పాడు. పిత పుత్ర పవిత్రాత్మ పేర్ల మీదిగా ప్రజలకు జ్ఞానస్నానం ఈయమని ఆదేశించాడు. పవిత్రాత్మ రాక కొరకు యెరూషలేములో వేచి వుండమని చెప్పాడు. శిష్యులు తనకు సాక్షులుగా వుండాలని ఆజ్ఞాపించాడు. లోకాంతం వరకు తాను శిష్యులతో వుంటానని మాట యిచ్చాడు. నలభై రోజుల తర్వాత వారిని బెతానియా చెంతగల ఒలీవల కొండకు కొనిపోయి ఆశీర్వదించాడు. ఆ పిమ్మట మోక్షారోహణం చేసి తండ్రి వద్దకు వెళ్లిపోయాడు. ఆలా పోతుండగా ఒక మేఘం అతన్ని కప్పి వేసింది. అప్పడు దేవదూతలు శిష్యులకు కన్పించి యేసు ఇప్పడు పరలోకానికి పోయినట్లే మళ్లా తిరిగివస్తాడు అని చెప్పారు. శిష్యులు ప్రభువును ఆరాధించి సంతోషంతో యెరూషలేముకి తిరిగి వచ్చారు.

89. మత్తీయ ఎన్నిక -అచ 1,15-26

శిష్యులు ఒలీవల కొండనుండి తిరిగిపోయి యెరూషలేములోని మీది గదిలో సమావేశమయ్యారు. అక్కడ క్రీస్తు తల్లి మరియు, మరికొందరు పుణ్యస్త్రీలు ప్రోగయ్యారు. భక్తులు మొత్తం 120 మంది అయ్యారు. అందరూ ప్రార్థనలో మునిగివున్నారు. పేతురు యూదా స్థానంలో మరో శిష్యుని ఎన్నుకొందామని చెప్పాడు. అతడు క్రీస్తు జీవితానికి సాక్షిగా వున్నవాడై వుండాలని కూడ తెలియజేశాడు. యూస్తు బర్సబ్బా యోసేఫు, మత్తీయ అనే యిద్దరు వ్యక్తులను ఎంపిక చేశారు. వీరిలో నీ యిష్టం వచ్చిన వానిని ఎన్నుకొమ్మని దేవునికి ప్రార్థన చేసి చీట్లు వేయగా మత్తీయ ఎన్నికయ్యాడు. కనుక అతడు యూదా స్థానాన్ని పూరించాడు.

90. పెంతెకోస్తు - అచ 2

క్రీస్తు ఉత్థానమైన తర్వాత 40 రోజులు, మోక్షారోహణం చేశాక 10 రోజులు, మొత్తం 50 రోజులు ముగిశాక యూదుల పెంతెకోస్తు