పుట:Nutna Nibandana kathalu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పండుగవచ్చింది. శిష్యులు ఒక చోట సమావేశమై జపం చేసికొంటూండగా పవిత్రాత్మ వారి మీదికి దిగివచ్చింది. అప్పుడు బలమైన గాలి వీచింది. నాలుకల్లాంటి నిప్పమంటలు వారిపై వాలాయి. వెంటనే వాళు అన్యభాషల్లో మాటలాడి దేవుణ్ణిస్తుతించారు. అన్యదేశాల్లో వసించే యూద భక్తులు ఆ పండుగకు యెరూషలేము వచ్చారు. వాళ్ళంతా గుమిగుడి శిష్యులు తమ సొంత భాషల్లో మాటలాడ్డం విని విస్తు పోయారు. కాని కొందరు వీళ్లు త్రాగి మత్తెక్కి మాట్లాడుతున్నారని గేలి చేశారు. అప్పడు పేతురు ఈలా చెప్పాడు. మీరనుకొన్నట్లుగా మేము త్రాగి రాలేదు. ఆత్మ శక్తితో మాటలాడుతున్నాం. మీరు నజరేయుడైన యేసుని సిలువ వేసి చంపారు. కాని తండ్రి అతన్ని జీవంతో లేపాడు.ఈ యేసు తండ్రినిచేరి అతని నుండి ఆత్మను పొంది ఆ యాత్మను మా యందరిపై కుమ్మరించాడు. కనుకనే మేము అన్యభాషల్లో దేవుని గొప్ప కార్యాలను వివరిస్తూ అతన్ని స్తుతిస్తున్నాం. దేవుడు యేసుని మెస్సియా గాను, ప్రభువుగాను నియమించాడు. ఇప్పడు మీరు మీ పాపాలకు పశ్చాత్తాపపడి యేసు పేరిట జ్ఞానస్నానం పొందండి. అప్పుడు మీరు కూడ మాలాగే ఆత్మను స్వీకరించి రక్షణం పొందుతారు అని చెప్పాడు. జనం అతని పలుకులు విని జ్ఞానస్నానం పొందారు. ఆరోజు 3000 మంది క్రైస్తవ సమాజంలో చేరారు. వారందరూ శిష్యుల బోధవిని వారితో కలసి జీవించారు. రొట్టె విరవడంలో, ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ విధంగా యెరూషలేములో మొదటి క్రైస్తవ సమాజం ప్రారంభమైంది.

91. కుంటివానికి స్వస్థత - అచ 3-4

పేతురు యోహాను సాయంకాలం యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. అక్కడో కుంటివాడు బిచ్చం అడుగుకొంటున్నాడు. అతడు బిచ్చం కొరకు వారివైపు చూడగా పేతురు నావద్ధ వెండి బంగారాలు లేవు. నజరేయుడైన యేసు శక్తితో నీవు లేచి నడువు అని చెప్పాడు.