పుట:Nutna Nibandana kathalu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాత్రి వారికి ఏమీ దొరకలేదు. వేకువన క్రీస్తు సరస్సు వొడ్డున కన్పించాడు. ఐనా వారు అతన్ని గుర్తు పట్టలేదు. క్రీస్తవారికి కుడిప్రక్కన వలవేయండి అని చెప్పాడు. ఆలాగే వేయగా వల పిగిలేన్ని చేపలు పడ్డాయి. యోహాను క్రీస్తుని గుర్తించి అతడు ప్రభువే అని పల్కాడు. పేతురు పై వస్రాన్ని తొడుగుకొని వొడ్డుకు ఈదుకొంటూ వచ్చాడు. ఇతరులు వలను వొడ్డుకి లాగారు. అక్కడ వారికి బొగ్గుల నిప్ప దానిమీద కాలుతూన్న చేప, రొట్టె కనిపించాయి. వారు కొనివచ్చిన చేపలు కొన్నిటిని గూడ ఆ నిప్పల మీద పెట్టారు. క్రీస్తువారికి చేపలను రొట్టెనూ పంచి యీయగా అందరూ భుజించారు. ఐనా వాళ్లు క్రీస్తుని నీ వెవరివి అని అడుగలేదు. అతడు ఎవరో వారికి తెలుసు.

87. పేతురుకు ఆదేశం - యోహా 21,15-19

భోజనం అయ్యాక ప్రభువు పేతురుని నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ఔనని పేతురు జవాబుచెప్పగా క్రీస్తు నీవు నా గొర్రెలను మేపు అన్నాడు. రెండవ పర్యాయం క్రీస్తు అదే ప్రశ్న అడగ్గా పేతురు అదేజవాబు చెప్పాడు. మూడవ పర్యాయం గూడ క్రీస్తు అదే ప్రశ్న అడగ్గా పేతురు మనసునొచ్చుకొని ప్రభూ! నీకు తెలియందేముంది? నేను నిన్ను ప్రేమిస్తున్న సంగతి నీకు తెలుసు అన్నాడు. ప్రభువు ఐతే నా గొర్రెలను మేపు అని చెప్పాడు. ఈలా ప్రభువు అతనికి తన సమాజం మొత్తం మీద సంపూర్ణ అధికారం ఇచ్చాడు. ఇంకా ప్రభువు అతనితో నీవు యువకుడివిగా వున్నప్పడు నీ యిష్టం వచ్చిన చోటికి పోయేవాడివి. కాని వృద్దుడవైనప్పుడు మరొకడు నీచేతులు కట్టివేసి నీ కిష్టంగాని చోటికి నిన్ను తీసికొని పోతాడు సుమా అని చెప్పాడు. అనగా పేతురు తనలాగే వేదసాక్షిగా మరణిస్తాడని సూచించాడు. ఆ పిమ్మట పేతురుతో నీవు నన్ననుసరించు అని చెప్పాడు.