పుట:Nutna Nibandana kathalu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

83. మగ్డల మరియకు దర్శనం - యోహా 20-11, 18

మరియు శిష్యులకు ఉత్థాన సమాచారం తెలియజేసి మళ్లా సమాధి దగ్గరకు వచ్చి విచారిస్తూ వుంది. అప్పడు ఇద్దరు దేవదూతలు కన్పించి అమ్మా! నీవు ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగారు. మరియ ప్రభువుని ఎవరోఎత్తుకొనిపోయారు అని చెప్పింది. అంతలో యేసు ఆమెకు కన్పించాడు. కాని ఆమె అతడు తోటమాలి అనుకొని అయ్యా! నీవు అతన్ని తీసికొని పోయినట్లయితే ఎక్కడ వుంచావో చెప్ప. నేను వెళ్లి తీసికొని పోతాను అని పల్కింది. యేసు ఆమెను మరియా అని పిల్చాడు. ఆ పిలుపులోనే ఆమె ప్రభువుని గుర్తించి అతని పాదాలకు పెనవేసికొంది. యేసు ఆమెతో నీవు నన్ను ఆలాగే పట్టుకొని వుండిపోవద్దు. పోయి నేను తండ్రివద్దకు వెళ్లి పోతున్నానని శిష్యులతో చెప్ప అని ఆదేశించాడు. మరియు వెళ్లి ఆలాగే తెలియజేసింది.

84. ఎమ్మావు శిష్యులకు దర్శనం -లూకా 24, 13-35

ఆదివారం ఇద్దరు శిష్యులు ఎమ్మావు నుండి యెరూషలేముకు ప్రయాణం చేస్తూ, క్రీస్తు మరణాన్ని గూర్చి మాట్లాడుకొంటున్నారు. ఉత్థాన క్రీస్తు కూడ వారితో కలసి ప్రయాణం చేశాడు. కాని వాళ్లు అతన్ని గుర్తించ లేదు. ఎవరో బాటసారిలే అనుకొన్నారు. యేసే వారిని పలకరించాడు. వాళ్లు మన ప్రధానార్చకులు యేసుని సిలువ వేశారు. మేము అతడే రాబోయే మెస్సియా అని నమ్మాము. మా పక్షం స్త్రీలు సమాధి దగ్గరికి వెళ్లగా దేవదూతలు అతడు జీవంతో లేచినట్లు చెప్పారు. కాని మేము మాత్రం అతన్ని కంటితో చూడలేదు. మా ఆశలన్నీ అడియాసలయ్యాయి అని చెప్పారు. ప్రభువు వారికి ప్రవక్తల బోధలను ఉదాహరించి మెస్సీయా మొదట శ్రమలు అనుభవించి తర్వాత మహిమను పొందుతాడు గదా అన్నాడు. ఈలా మాట్లాడుకొంటూ సాయంకాలానికల్లా ముగ్గురూ ఎమ్మావుగ్రామన్ని చేరారు. శిష్యులు అయ్యా! చీకటి పడుతుంది.