పుట:Nutna Nibandana kathalu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ రాత్రికి మాయింటిలో వుండిపో అన్నారు. రాత్రి భోజనం చేసేటప్పడు యేసు రొట్టెను ఆశీర్వదించి త్రుంచి అందరికీ అందించాడు. అప్పడు ఇద్దరు శిష్యులూ అతడు యేసేనని గుర్తించారు. వెంటనే ప్రభువు మరుగైపోయాడు. వాళ్లు దారిలో అతడు ప్రవచనాలను ఉదాహరించి చెప్పినప్పడు మనకు భక్తి పారవశ్యం కలిగింది గదా అనుకొన్నారు. ఆ పిమ్మట వాళ్లు యెరూష లేముకు తిరిగిపోగా అక్కడి వాళ్లు ప్రభువు ఉత్థానమై పేతురుకి కన్పించాడు అని చెప్పకొంటున్నారు. ఆ యిద్దరు కూడ ప్రభువు దారిలో తమకు దర్శనమిచ్చిన తీరును తెలియజేశారు.

85. యెరూషలేములో దర్శనం -యోహా 21,19-29

ఆదివారం సాయంకాలం శిష్యులు ఒక యింటిలో తలుపులు మూసికొని ప్రార్థన చేసికొంటున్నారు. దిడీలున క్రీస్తు ప్రత్యక్షమై మీకు శాంతి కలుగును గాక అని చెప్పాడు. వారికి తనచేతులూ ప్రక్కా చూపించాడు. వారి మీద పవిత్రాత్మను ఊది పాపాలను క్షమించే అధికారాన్ని దయచేశాడు. మీరు వెళ్లి నన్ను బోధించండి అని చెప్పాడు.

అప్పడు తోమా శిష్యులతో లేడు. ఇతరులు మేము ప్రభువును చూచామని చెప్పినా అతడు నమ్మలేదు. నేను అతని చేతుల్లోని గాయాలను చూస్తేనే గాని నమ్మను అన్నాడు. ఎన్మిది రోజుల తర్వాత శిష్యులందరూ సమావేశమై ఉన్నప్పడు ప్రభువు మళ్లా కన్పించాడు. తోమాతో నా చేతుల్లోని గాయాల్లోను నా ప్రక్కలోని గాయంలోను నీ చేయి పెట్టి చూడు. సందేహించ కుండ నన్ను నమ్మ అని చెప్పాడు. తోమా నా ప్రభూ! నా దేవా! నేను నిన్ను నమ్ముతున్నాను అని చెప్పాడు. యేసు నీవు నన్ను చూచి నమ్ముతున్నావు. చూడకుండ నమ్మేవాళ్లు మరీ ధన్యులు అని పల్కాడు.


86. సరస్సు తీరాన దర్శనం -యోహా 21,1-14

శిష్యులు గలిలయ సరస్సులో చేపలు పట్టడానికి పోయారు. కాని