పుట:Nutna Nibandana kathalu.pdf/42

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


బట్టి దేవుడు మనకు తీర్పు విధిస్తాడు. తోడి జనానికి చేసిన మంచిగాని చెడ్డగాని తనకు చేసినట్లే భావిస్తాడు.

70. శిష్యుల కాళ్లు కడగడం - యోహా 13,1-7

గురువారం శిస్యులు క్రీస్తు ఆజ్ఞ ప్రకారం ఒక నరుని యింటిలో పాస్క భోజనం సిద్ధం జేశారు. అందరూ భోజనానికి కూర్చున్నారు. యేసు పంక్తినుండి లేచి పై వస్రం తీసివేశాడు. నడుముకి తుండగుడ్డ చుట్టుకొని పళ్లెంలో నీరుపోసి శిష్యుల కాళ్లు కడిగాడు. తుండు గుడ్డతో వాటిని తుడిచాడు. పేతురు అడ్డువచ్చి నీవు నా పాదాలు కడగకూడదు అన్నాడు. యేసు ఆలాగైతే నీవు నాకు చెందినవాడవు కావు అని చెప్పాడు. పేతురు అట్లయితే నా చేతులు, తలను కూడ కడుగు అని పల్మాడు. ఆలా అందరు శిష్యుల కాళ్లు కడిగాక ప్రభువు మళ్లా కూర్చుండి నేను మీకు ఈ యా దర్శాన్ని చూపించాను గదా! మీరు కూడ నాలాగే ఒకరి పాదాలు వొకరు కడగాలి సుమా అని చెప్పాడు.

71. సత్ర్పసాద స్థాపనం -మత్త 26,26–29

గురువారం ప్రభువు శిష్యులతో అంత్య భోజనం ఆరగిస్తుండగా రొట్టెను తీసికొని ఆశీర్వదించి త్రుంచి శిష్యులకిచ్చి ఇది నా శరీరం మీరందరు దీనిని తీసికొని భుజించండి అని చెప్పాడు. ఆలాగే పాత్రను తీసికొని ఇది పాపపరిహారానికి చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తం. మీరందరు దీనిని త్రాగండి అని చెప్పాడు. ఇక్కడ ప్రభువు తన శరీరరక్తాలనే మనకు ఆహారంగా దయచేశాడు.

72. యూదా ద్రోహం - లూకా 22, 3-6

యూదాకు డబ్బు మీద ఆశ పుట్టింది. యూదనాయకులు క్రీస్తుని చంపడానికి పన్నాగాలు పన్నుతున్నారు. పిశాచం యూదాలోకి ప్రవేశిం చింది. ఇకనేం, అతడు ఆ నాయకుల వద్దకు వెళ్లి బేరసారాలు ప్రారంభిం చాడు. వారినుండి ముప్పయి వెండినాణాలు తీసికొని గురువుని పట్టి