పుట:Nutna Nibandana kathalu.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఒక లక్ష డబ్బిచ్చి ఆ సొమ్ము వృద్ధి చేయండని చెప్పాడు. అతడు తిరిగి వచ్చేటప్పటికి మొదటివాడు పదిలక్షలు గడించాడు. రెండవవాడు నాలు లక్షలు ప్రోగుజేశాడు. యజమానుడు ఆ యిద్దరినీ మెచ్చుకొన్నాడు. కాని మూడవవాడు సొమ్ము వృద్ధి చేయక భూమిలో దాచివుంచాడు. అయ్యా! నీవు కచ్చితమైన మనిషివి. విత్తనాలు వేయకుండానే పంట కోయాలని చూచేవాడివి. నీ సొమ్ము భద్రంగా దాచివుంచాను. తీసికో అని చెప్పాడు. యజమానుడు మండిపడి, ఓరీ సోమరిపోతూ! నా సొమ్మ కనీసం వడ్డీకిచ్చిన కొంత పెరిగేది కదా? నీవు చేసిన శ్రమయేదీ అని అడిగాడు. ఆ సొమ్మ తీసికొని మొదటివానికి యిచ్చాడు. దైవరాజ్యంలో ఎవరికృషి వాళ్లు చేయాలి.

69. తుది తీర్పు - మత్త 25, 31-46

క్రీస్తు న్యాయాధిపతిగా వచ్చి నరులందరికీ తీర్పు తీరుస్తాడు. మంచివాళ్లు అతని కుడిప్రక్కనా, చెడ్డవాళ్లు ఎడమప్రక్కనా నిలుస్తారు. అతడు మంచివాళ్లతో మీరు నా అవసరాల్లో నాకు అన్నపానీయాలు అందించారు. బట్టలిచ్చారు. వ్యాధిలో నన్ను పరామర్శించారు. చెరసాలలో వున్నపుడు దర్శించారు అని చెప్తాడు. వాళ్లు అయ్యా! మేము ఈ సేవలన్నీ నీకు ఎప్పడు చేశాం అని అడుగుతారు. అతడు మీరు దీనులైన నా సోదరులకు చేసిన సేవలన్నీ నాకు చేసినట్లే గదా అంటాడు. వారికి మోక్షబహుమతిని దయచేస్తాడు. పిమ్మట అతడు చెడ్డవారితో మీరు నా అవసరాల్లో నాకు అన్నపానీయాలు ಬಟ್ಜಲು ఈయలేదు. వ్యాధిబాధల్లో నన్ను పరామర్శించ లేదు. చెరసాలలో వుండగా నన్ను దర్శింపరాలేదు అంటాడు. వాళ్లు కూడ అయ్యా! మేము ఈ సేవలన్నీ నీకు ఎప్పడు చేయలేదో చెప్పమని అడుగుతారు. అతడు మీరు దీనులైన నా సోదరులకు ఈ సేవలు చేయలేదు కనుక నాకు కూడ చేయనట్లే అంటాడు. వారికి నరక శిక్ష పడుతుంది. మనం అక్కరలో వున్న తోడి జనాన్ని పట్టించుకొన్నామాలేదా అన్నదాన్ని