పుట:Nutna Nibandana kathalu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వేసే తీరును గమనిస్తున్నాడు. ఉమ్మెత్త పూవు ఆకారంలో వుండే పెట్టెల్లో ప్రజలు కానుకలు వేసేవాళ్లు. ధనవంతులు వచ్చి పెద్దమొత్తాలే వేశారు. ఆ పిమ్మట ఓ పేద విధవ వచ్చి రెండు పైసలు మాత్రమే పెట్టెలో వేసింది. ప్రభువు కానుకలన్నిటిలోను ఆమె కానుక గొప్పది అన్నాడు. ధనవంతులకు నాలు సౌమ్మంది. వాళ్లు ఆ సొత్తులో కొంత భాగం మాత్రమే దేవుడికిచ్చారు. కాని ఈ పేదరాలికి వున్నది రెండుకాసులే. ఆమె తనకున్నదంతా దేవుణ్ణి నమ్మి అతనికిచ్చింది. ఆ పిమ్మట దేవుడే తన్ను పోషిస్తాడు అని నమ్మింది. దేవునికి ఎంత యిచ్చామన్నది గాదు, ఏలాంటి మనస్తత్వంతో ఇచ్చామన్నది ముఖ్యం.

67. పదిమంది కన్నెల సామెత - మత్త 25,1-13

రెండవ రాకడకు కనిపెట్టుకొని వుండాలి అనడానికి ప్రభువు ఈ కథ చెప్పాడు. పెండ్లి కుమారునికి స్వాగతం చెప్పడానికి పదిమంది కన్నెలు కాగడాలతో పోయారు. వారిలో ఐదుగురు తెలివితో కాగడాలతో పాటు మిగులు చమురు తీసికొని పోయారు. తతిమ్మా ఐదుగురు తెలివి లేనందున మిగులు చమురు తీసికొని పోలేదు. పెండ్లి కుమారుడు రావడానికి ఆలస్యమైంది. కనుక పదిమంది నిద్రపోయారు. అపరాత్రిలో పెండ్లి కుమారుడు రాగా అందరూ నిద్రలేచి కాగడాలు వెలిగించారు. కాని చమురు ఐపోయినందున తెలివిలేని కన్యల కాగడాలు ఆరిపోయాయి. వాళ్లు మిగతా వారిని చమురు అడిగారు. వాళ్లు మాకూ మీకూ ఈ చమురు సరిపోదు. మీరు అంగడికి వెళ్లి కొనితెచ్చుకోండి అన్నారు. ఐదుగురు అంగటినుండి తిరిగివచ్చే లోపులోనే పెండ్లికుమారుడు రావడమూ వివాహశాలను మూసివేయడమూ జరిగాయి. కనుక వారికి ప్రవేశం లభించలేదు. ప్రభువు రాకడకు ఎప్పడూ సిద్ధంగానే వుండాలి.

68. ముగ్గురు సేవకుల కథ - మత్త 25,14-30

ఒక యజమానునికి ముగ్గురు సేవకులు వున్నారు. అతడు మొదటివానికి ఐదులక్షలు, రెండవ ప్తానికి రెండు లక్షలు మూడవ వానికి