పుట:Nutna Nibandana kathalu.pdf/43

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


యీయడానికి సిద్ధమయ్యాడు. కొద్దిపాటి సొమ్ముకి ఆశపడి అతడు ఏ నాటికి తొలగిపోని కళంకం తెచ్చుకొన్నాడు.

73. యూదా ద్రోహాన్ని ఎరిగించడం - మత్త 26,20-25

అంత్యభోజనం సమయంలోనే క్రీస్తు శిష్యులతో మీలో వొకడు నన్ను శత్రువులకు అప్పగిస్తాడు అనిచెప్పాడు. ఆ మాటలకు కలత చెంది శిష్యులు ఒక్కొక్కడు నేనా నేనా అని అడగసాగారు. యేసు నాతోపాటు పాత్రలో రొట్టెను ముంచినవాడు నన్ను అప్పగిస్తాడు. లేఖనాలు వాకొన్నట్లుగా మనుష్యకుమారుడు మరణిస్తాడు. కాని నన్ను అప్పగించే వానికి అనర్ధం. అతడు పుట్టకుండ వున్నా బాగుండేది అన్నాడు. అప్పడు యూదా కూడ నేనా అని అడగ్గా యేసు నీవే చెప్తున్నావు అన్నాడు. అంతకు ముందే యూదా క్రీస్తుని విరోధులకు ముప్పై వెండికాసులకు అమ్మివేశాడు.

74. గెత్సెమనిలో ఆవేదనం - మత్త 26,36-46

గురువారం రాత్రి యేసు శిష్యులను తీసికొని గెత్సెమని తోటకు వెళ్లాడు. వారిలో ముగ్గురుని తీసికొని కొంచెం దూరంగా వెళ్లాడు. వారితో నేను మరణవేదనలో వున్నాను. మీరిక్కడే వుండి జాగరణం చేయండి అనిచెప్పి తాను కొంచెం దూరంగా పోయి నేలమీద బోరగిలపడి ప్రార్థన చేశాడు. తండ్రీ! ఈ పాత్రను నా నుండి తొలగించు. ఐనా నీ చిత్తం కాని నా చిత్తం కాదు అని వేడుకొన్నాడు. ఆ పిమ్మట ముగ్గురి దగ్గరికి వచ్చి చూడగా వాళ్లు నిద్రిస్తున్నారు. మీరు కాసేపు నాతోపాటు మేల్కొని వుండలేరా? శోధనకు లొంగకుండ వుండడానికి గాను మేల్మొని వుండండి అని చెప్పాడు. ఆ పిమ్మట మళ్లా దూరంగా పోయి తండ్రీ! నేను త్రాగిననే తప్ప ఈ పాత్ర తొలగిపోదేని, నీ చిత్తమే నెరవేరనీయి అని జపించాడు. మళ్లా వారి దగ్గరికి వచ్చి శిష్యులు నిద్రిస్తూండడం చూచాడు. మళ్లా కొంతదూరం పోయి మూడవ సారి కూడ అదే ప్రార్ధన