పుట:Nutna Nibandana kathalu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34. ఊచచేతివానికి ఆరోగ్యం - మత్త 12,9-14


యేసు విశ్రాంతి దినాన ప్రార్థనా మందిరానికి వెళ్లాడు. అక్కడ చేయి చచ్చుపడిన రోగి వున్నాడు. పరిసయులు ప్రభువును తప్పపట్టగోరి విశ్రాంతి దినాన వ్యాధులు నయం జేయవచ్చా అని అడిగారు. ప్రభువు విశ్రాంతి దినాన మీ గొర్రె గోతిలో పడితే మీరు దాన్ని బయటికి తీయరా? గొర్రె కంటె నరుడు శ్రేష్టుడు కాడా అని అడిగాడు. తర్వాత ఆ రోగి చేతిని నయం జేశాడు. యూద నాయకులు ఆగ్రహం చెంది అతన్ని చంపడానికి కుట్రలు పన్నారు.

35.పండ్రెండు మంది శిష్యులు -లూకా 6,12-16

ప్రభువు కొండకు పోయి రాత్రంతా ఏకాంతంగా తండ్రికి ప్రార్ధన చేసికొన్నాడు. తండ్రి చిత్తాన్ని తెలిసికొన్న తర్వాత పండ్రెండు మంది శిష్యులను ఎన్నుకొన్నాడు. వాళ్లు మొదట అతనితో వుండి అతనినుండి అన్నీ నేర్చుకొంటారు. తర్వాత సువార్తను ప్రకటిస్తారు. క్రీస్తు తండ్రి వద్దకు వెళ్లిపోయిన తర్వాత అతని వుద్యమాన్ని కొనసాగిస్తారు. వాళ్లు పేతురు,అంద్రేయ యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా అల్ఫయి కుమారుడైన యాకోబు, దేశభక్తుడైన సీమోను, యూదా, అతనిని అప్పగించిన యూదా. ప్రభువు వారికి అద్భుతాలు చేసే శక్తినీ, దయ్యాలను పారదోలే శక్తినీ దయచేశాడు. వాళ్లు ధనం మీదా పలుకుబడి మీదా ఆధారపడకూడదు. కేవలం దైవబలాన్ని నమ్మి బోధ చేయాలి. పావురాల్లలాగ నిష్కపటంగాను, పాముల్లాగా జాగ్రత్తగాను మెలగాలి.

36. యోహాను మరణం -మత్త 14,6-12

స్నాపక యోహాను తన్ను మందలించినందున హెరోదు కోపించి అతన్ని చంపించగోరాడు. కాని ప్రజలకు భయపడ్డాడు. ఆ రాజు జన్మదినాన హేరోదియా కొమార్తె నాట్యంచేసి అతన్ని మెప్పించింది. రాజు నీవు ఏ మడిగినా యిస్తానని అందరి యెదుట ప్రమాణం చేశాడు. తల్లి