పుట:Nutna Nibandana kathalu.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఆమెను యోహాను శిరస్సును అడగమని ప్రోత్సహించింది. ఆ బాలిక యోహాను శిరస్సును ఓ పల్లెంలో పెట్టి యిప్పంచమని రాజుని కోరింది. అతడు అందరి యెదుట మాట యిచ్చినందున తప్పించుకోలేక పోయాడు. సేవకుణ్ణిపంపి చెరలోవున్న యోహాను తల నరికించి తెప్పించి బాలికకు ఇచ్చాడు. ఆమె దానిని తల్లికి అందించింది. యోహాను శిష్యులు గురువు దేహాన్ని గౌరవ పూర్వకంగా పాతిపెట్టారు.

37. ఐదువేల మందికి ఆహారం -మత్త 14,13-21

యేసూ శిష్యులూ ఓ నిర్ణన ప్రదేశంలో వున్నారు. ఐనా అక్కడ కూడ ఐదువేల మంది జనం అతని చుటూ ప్రోగయ్యారు. ప్రభువు వారి వ్యాధిబాధలు కుదిర్చాడు. సాయంకాలం ఆ ప్రజలకు ఆహారం పెట్టమని శిష్యులతో చెప్పాడు. అప్పడు శిష్యుల దగ్గర ఐదు రొట్టెలు రెండుచేపలు మాత్రమే వున్నాయి. అంతమంది జనానికి అవి యేలా సరిపోతాయి? ప్రభువు ప్రార్థన చేసి వాటిని త్రుంచి శిష్యులకిచ్చాడు. శిష్యులు వాటిని ప్రజలకు పంచిపెట్టగా అవి ఐదువేలమందికి సరిపోయి ఇంకా మిగిలేలా పెరిగి పోయాయి.

38. నీటిపై నడవడం -మత్త 14,22-33

ప్రభువు ప్రార్ధన చేసికోవడానికి ఏకాంత స్థలానికి వెళ్లాడు. ఆ సాయంకాలం శిష్యులు పడవనెక్కి సరస్సులో ప్రయాణం చేస్తున్నారు. గాలి ప్రతికూలంగా వీస్తున్నందువలన వారి పడవ దూరంగా కొట్టుకొని పోయింది. వేకువజామున ప్రభువు నీటిపై నడచి వారి వద్దకు వచ్చాడు. శిష్యులు అతన్ని చూచి దయ్యమనుకొని భయంతో కేకలు వేశారు. ప్రభువు నేనే గదా భయపడకండి అన్నాడు. పేతురు ప్రభూ! నీవే ఐతే నేను కూడ నీటిమీద నడచి నీ వద్దకు వచ్చేలా చేయి అన్నాడు. యేసు రమ్మనగానే పేతురు పడవదిగి నీటిమీద కాసేపు నడచాడు. ఆ మీదట వేగంగా వీచే గాలికి భయపడి నీటిలో మునగడం మొదలెట్టాడు. ప్రభూ! నన్ను కాపాడు