పుట:Nutna Nibandana kathalu.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గాలివాన పట్టుకొంది. క్రీస్తు అలసిపోయి పడవలో ఓ మూలన పండుకొని నిద్రపోతున్నాడు. శిష్యులు ప్రభూ! మేము ఆపదలో వున్నాం, మమ్మ కాపాడవా అంటూ ప్రభువుని నిద్ర లేపారు. అతడు గాలిని సముద్రాన్ని ఆజ్ఞాపించగా వెంటనే వాతావరణం నిమ్మళమైంది. ఆ పడవలో వున్న వాళ్లు ప్రకృతి శక్తులు కూడ ఇతనికి లొంగుతున్నాయి కదా అని ఆశ్చర్యపోయారు. మన జీవితంలో ఎదురయ్యే ఆపదల్లో ప్రభువుని శరణు వేడితే అతడు వాటినుండి మనలను కాపాడతాడు.

33. రక్తస్రావరోగి, చనిపోయిన బాలిక -మత్త 9,18-26

యాయీరు అనే అధికారి కూతురు జబ్బుపడి మరణావస్థలో వుంది. అతడు నీవు వచ్చి నా బిడ్డకు ఆరోగ్యం చేకూర్చమని క్రీస్తుని వేడుకొన్నాడు. ప్రభువు అతని యింటికి వెళూండగా జనం ప్రభువు చుటూ ప్రోగయ్యారు. పండ్రెండు సంవత్సరాలనుండి రక్తస్రావంతో బాధపడుతూన్న ఓ స్త్రీ వచ్చి ఆయన వస్తాన్ని తాకింది. అతని ಬಟ್ಜಲಮಿ ముట్టుకొంటే చాలు తనకు ఆరోగ్యం చేకూరుతుందని ఆమె నమ్మకం. వెంటనే ఆమెకు ఆరోగ్యం కలిగింది. ప్రభువు తననుండి శక్తి వెలుపలికి వెళ్లిందని గ్రహించి నా దుస్తులను తాకింది ఎవరని అడిగాడు. రోగి భయపడుతూ ముందుకు వచ్చి అయ్యా తాకింది నేనేనని చెప్పింది. ప్రభువు కుమారీ! నీ విశ్వాసమే నీకు ఆరోగ్యాన్ని చేకూర్చింది అని చెప్పాడు. అంతలో యూయీరు స్నేహితులు ఎదురు వచ్చి బాలిక చని పోయిందని చెప్పారు. ప్రభువు యాయిరుతో నీవు భయపడకు. నమ్మకంతో వుండు అని చెప్పాడు. అందరూ బాలిక వున్న గది ప్రవేశించారు. క్రీస్తు అమ్మాయి చేయి పట్టుకొని బిడ్డా! లెమ్మని చెప్పాడు. వెంటనే ఆ యమ్మాయి లేచి అటూయిటూ నడచింది. ప్రభువు ఆమెకు తినడానికి ఏమైనా పెట్టండని చెప్పాడు. ఈ యద్భుత కార్యాన్ని చూచి అందరూ విస్తుపోయారు.