పుట:Nutna Nibandana kathalu.pdf/20

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


పోతూండగా ఆ వుద్యోగి మిత్రులను పంపి అయ్యా! నీవు మా యింటికి రావడానికి నేను యోగ్యుణ్ణి కాను. నీవు వున్న చోటనే వుండి ఒక్కమాట పలికితే చాలు, నా దాసుడు బాగుపడతాడు అని చెప్పించాడు. క్రీస్తు అతని విశ్వాసాన్ని మెచ్చుకొని అక్కడినుండే ఆ సేవకుని వ్యాధిని కుదిర్చాడు.


25. నాయినాను వితంతువు కుమారుడు -లూకా 7,11-17


యేసు నాయీను గ్రామాన్ని సమీపిస్తూండగా ఓ యువకుని శవాన్ని మోసుకొని పోతున్నారు. అతడు ఓ విధవకు ఏకైక కుమారుడు. యేసు ఆ తల్లి పై జాలిగొని పాడెను చేతితో తాకి యువకుడా! నీవు జీవంతో లే అని చెప్పాడు. వెంటనే అతడు లేచి కూర్చున్నాడు. ప్రజలు ఆశ్చర్యపోయి ఓ గొప్ప ప్రవక్త మనమధ్యకు వచ్చాడు అని పలికి దేవుణ్ణి స్తుతించారు.

26. యోహాను దూతలు -మత్త 11,2-6

హేరోదు ఆంటిప గలిలయకు పాలకుడయ్యాడు. అతడు తన తమ్ముడు ఫిలిప్ప బార్యను ఉంచుకొన్నాడు. యోహాను ఇది ధర్మం కాదని హేరోదుని మందలించాడు. ఆ రాజు కోపించి యోహానుని చెరలో త్రోయించాడు. అతనికి క్రీస్తుపట్ల సందేహం కలిగి ఇద్దరు శిష్యులను పంపించాడు. వాళ్లు రాబోయే మెస్సీయావు నీవా లేక మేము మరొకరికొరకు ఎదురు చూడాలా అని మా గురువు అడుగుతున్నాడు అని చెప్పారు. క్రీస్తువారితో మీరు నా అద్భుతాలను యోహానుకి తెలియజేయండి. మృతులు జీవంతో లేస్తున్నారు. నేను పేదలకు సువార్త బోధిస్తున్నాను. నన్ను గూర్చి సందేహించవద్దని మీ గురువుకి తెలియజేయండి అని చెప్పాడు.

27. సీమోను ఇంటిలో పాపాత్మురాలు -లూకా 7,36-49

యేసు సీమోను అనే పరిసయుని ఇంటికి భోజనానికి వెళ్లాడు. ప్రభువు బోధల వలన అదివరకే పరివర్తనం చెందిన ఓ పాపాత్మురాలు అచ్చటికి వచ్చింది. అతని పాదాలను కన్నీటితో తడిపి తలవెండ్రుకలతో తుడిచి పరిమళద్రవ్యంతో అభిషేకం చేసింది. సీమోను తన్ను తాకుతూ I