పుట:Nutna Nibandana kathalu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వున్న ఈ స్త్రీ ఎలాంటిదో తెలిసికోలేని ఈ యేసు ఏ పాటి ప్రవక్త అని తనలో తాను అనుకొంటున్నాడు. ప్రభువు సీమోనూ! ఓ ధనవంతునికి ఒకడు పెద్ద మొత్తమూ, ఇంకొకడు చిన్న మొత్తమూ బాకీ పడ్డారు. వాళ్లు బాకీ తీర్చలేనందున అతడు ఇద్దరినీ క్షమించాడు. వారిలో ఎవడు ధనవంతుని ఎక్కువగా ప్రేమిస్తాడో చెప్ప అని అడిగాడు. సీమోను ఎక్కువ మొత్తం క్షమింపబడినవాడే కదా అన్నాడు. ప్రభువు నీవు చెప్పింది నిజమే. దేవుడు ఈ భక్తురాలి పాపాలను అధికంగా క్షమించాడు. కనుక ఈమె అతన్ని అధికంగానే ప్రేమించింది సుమా అని చెప్పాడు. పిమ్మట ఆ స్త్రీని చూచి అమ్మా! నీ పాపాలకు క్షమాపణం లభించింది. ఇక సంతోషంగా వుండు అని పల్కాడు.

28. దీర్ఘకాల రోగికి ఆరోగ్యం - యోహా 5,1-18

యేసు పాస్కపండుగకు యెరూషలేము వెళ్లాడు. అక్కడ బెత్పతా అనే కొనేరు వుంది. దానిలో అప్పడప్పడు నీళ్లు కదిలేవి. ఆలా కదిలినప్పడు మొదట నీటిలో దిగిన రోగికి ఆరోగ్యం చేకూరేది. కనుక చాలమంది రోగులు అక్కడ కనిపెట్టుకొని వుండే వాళ్లు. అక్కడ 38ఏండ్లనుండి వ్యాధితో బాధపడుతున్న তPA వొకడున్నాడు. చాలకాలం అక్కడ వేచివున్నా అతనికి మడుగులో దిగే అవకాశం లబించలేదు. ప్రభువు అతన్ని నీకు ఆరోగ్యం కావాలా అని అడిగాడు. అతడు అయ్యా! నీరు కదిలినప్పడు నన్ను నీటిలో దించేవాళ్లు ఎవరూ లేరు. ఇతరులు నా కంటె ముందుగా పోయి కోనేటిలో దిగుతున్నారు అని చెప్పాడు. ప్రభువు నీ పడకనెత్తుకొని ఇక్కడినుండి వెళ్లిపో అని చెప్పాడు. అతడు వెంటనే ఆరోగ్యాన్ని పొంది పడవనెత్తుకొని నడచాడు.

అది విశ్రాంతి దినం కావడంచే చిన్నపని కూడ చేయకూడదు. కనుక యూద నాయకులు అతన్ని తప్పపట్టారు. నిన్ను పడక మోయమన్నది ఎవరని దబాయించారు. అతనికి యేసుని గూర్చి తెలియదు కనుక వారికి జవాబు చెప్పలేకపోయాడు.